cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Press Releases

మహర్షి సినిమా బ్లాక్ బస్టర్... దిల్ రాజు

మహర్షి సినిమా బ్లాక్ బస్టర్... దిల్ రాజు

అనుకున్నట్లే, ముందుగా ఊహించినట్లే బ్లాక్ బస్టర్ అయిందని, ఇందుకు ప్రేక్షకులకు, సినిమాను వాళ్ల దగ్గరకు చేరువయ్యేలా చేసిన మీడియాకు కృతజ్ఞతలు అని నిర్మాత దిల్ రాజు అన్నారు. మహర్షి సినిమా సక్సెస్ అయిన సందర్భంగా దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. ''మహర్షి'  మహేష్‌బాబు కెరీర్‌లో హయ్యస్ట్‌ రెవెన్యూ కలెక్ట్‌  తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో 24.6 కోట్ల షేర్‌ వసూలు చేసి ఎపిక్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిందని ఆయన వెల్లడించారు.. 

మహేష్‌బాబు కెరీర్‌లోనే హయ్యస్ట్‌ రెవెన్యూ వచ్చింది. నైజాంలో నాన్‌ బాహుబలి రెవెన్యూ వచ్చింది. దాదాపు అన్నిచోట్ల అదే పరిస్థితి ఉంది. ఓవరాల్‌గా మహేష్‌బాబుగారి కెరీర్‌లో ల్యాండ్‌ మార్క్‌ మూవీ అవబోతుంది. ఈరోజు కూడా నెల్లూరులో 9 థియేటర్స్‌ ఉంటే అన్నీ ఫుల్స్‌ అయ్యాయి. ఈ సినిమా కమర్షియల్‌గా నెక్స్‌ట్‌ లెవెల్‌కి వెళ్ళబోతుంది అనడానికి ఇదొక నిదర్శనం. ఈ సమ్మర్‌లో, తెలుగు ఇండస్ట్రీలో టాప్‌ గ్రాసర్‌గా నిలుస్తుందనుకుంటున్నాను. 'మహర్షి' టీమ్‌ మొత్తానికి కంగ్రాట్స్‌'' అని దిల్ రాజు అన్నారు. 

దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ - ''మహర్షి' చిత్రానికి ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ థాంక్స్‌. ఇదొక హార్ట్‌ హిట్టింగ్‌ ఫిల్మ్‌. ప్రతి ఒక్కరి మనసులోకి వెళ్ళి ఒక మంచి ఆలోచనను సృష్టిస్తుంది. మా సినిమాకి ఫస్ట్‌నుండి సహకరించిన మీడియాకి ధన్యవాదాలు. ఈ విజయం నా రాబోయే చిత్రాలకు పాజిటివ్‌ ఎనర్జీని ఇస్తుంది. ఈ సినిమాతో నాకు ఫస్ట్‌టైమ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ కాల్‌ చేసి అభినందిస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఫోన్‌ చేసి వారు సినిమాలో ఏయే అంశాలకు కనెక్ట్‌ అయ్యారో చెబుతున్నారు.

ఇదొక థాట్‌ ప్రొవోక్‌ సినిమా. ఇంటర్నల్‌గా మనం వెతుక్కునే సక్సెస్‌, అలాగే ఎక్స్‌టర్నల్‌గా ఒక సమాజానికి ఎలా ఉపయోగపడాలి అని రెండు పాయింట్లు చెప్పాం.  మెగాస్టార్ చిరంజీవి గారు ఫోన్ చేసి సినిమా గురించి అయిదు నిమిషాలు మాట్లాడారు. ఇది నా జీవితంలో ఓ మెమొరబుల్‌ మూమెంట్‌. ఆయన సినిమాలోని ప్రతి ఒక్క పాయింట్‌ గురించి మాట్లాడుతుంటే.. చాలా సంతోషమేసింది అని అన్నారు వంశీ పైడిపల్లి. 

హీరోయిన్‌ పూజా హెగ్డే మాట్లాడుతూ - ''మహర్షి' సినిమాని సక్సెస్‌ చేసిన తెలుగు ఆడియన్స్‌ అందరికీ ధన్యవాదాలు. మహేష్‌గారి ల్యాండ్‌ మార్క్‌ ఫిల్మ్‌లో నేను కూడా భాగమైనందుకు హ్యాపీగా ఉంది. థియేటర్‌లో 'పాలపిట్ట' సాంగ్‌కి స్క్రీన్‌ కనపడకుండా పేపర్స్‌ వేయడం చాలా థ్రిల్లింగ్‌గా అన్పించింది. నన్ను సపోర్ట్‌ చేస్తున్న మీడియాకి ధన్యవాదాలు'' అన్నారు. 

రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ మాట్లాడుతూ - ''కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉంటూనే, మంచి హార్ట్‌ టచ్చింగ్‌ మూవీని అందించిన వంశీ పైడిపల్లిని అభినందిస్తున్నాను. అలాగే మహేష్‌గారు కమర్షియల్‌ ఎంటర్‌టైనర్స్‌తో పాటు సోషల్‌ మెసేజ్‌ ఉన్న సినిమా చేయడం నిజంగా చాలా గ్రేట్‌. ప్రొడ్యూసర్ల ప్యాషన్‌ సినిమాని నెక్స్‌ట్‌ లెవెల్‌కి తీసుకెళ్ళింది. 

మహేష్‌గారి 25వ సినిమా 'మహర్షి', అలాగే ఎన్టీఆర్‌గారి 25వ సినిమా 'నాన్నకు ప్రేమతో', సూర్య 25వ సినిమా 'సింగం' చిరంజీవిగారి 150వ సినిమా 'ఖైది నెంబర్‌ 150' ఇలా.. వీళ్లందరి ల్యాండ్‌ మార్క్‌ ఫిలింస్‌లో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నాను. 

'మహర్షి' సినిమా సూపర్‌హిట్‌ అయిన సందర్భంగా చిత్ర యూనిట్‌ బాణసంచా కాల్చి మీడియాతో తమ అనందాన్ని పంచుకున్నారు.