Advertisement


Home > Movies - Press Releases
మళ్లీ అష్టా చెమ్మా

డైరక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ అష్టా చెమ్మా సినిమాను అంత సులువుగా ఎవరూ మరిచిపోలేరు. అవుట్ అండ్ అవుట్ క్లాస్ కామెడీ సినిమా అది. కేవలం చిన్న కాన్ ఫ్లిక్ట్ పాయింట్ పట్టుకుని, సినిమా ఆద్యంతం నవ్వులతో ముంచెత్తేసిన సినిమా అది. ప్రతి పాత్ర నవ్వించడమే పరమార్థంగా కనిపిస్తుంది ఆ సినిమాలో. అలా అని రొడ్డ కామెడీ, రొటీన్ కామెడీ కాదు. ఒక్క సెకెండ్ ఆలోచించి నవ్వుకుని, ఆ తరువాత సెకెన్లు, సెకెన్లు నవ్వుకునే వ్యవహారం. అష్టా చెమ్మా వచ్చిన ఇన్నాళ్లకు మళ్లీ అలాంటి సినిమా అటెంప్ట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది ఇంద్రగంటి లేటెస్ట్ సినిమా అమీతుమీ ట్రయిలర్ చూస్తుంటే. అవసరాల,అడవి శేష్ వెన్నెల కిషోర్, తనికెళ్ల, ఈషా తదితరుల నడుమ ఏదో కన్ఫ్యూజ్ కామెడీ మిక్స్ చేసి, రన్ చేసినట్లు కనిపిస్తోంది.

స్వయంభూలింగాలకు పెళ్లి చేయడం శాస్త్రాల్లో వుంది కానీ స్వలింగాల్లో వున్నట్లు లేదు, ఏమిటిది సల్మాన్ ఖాన్ కొత్త స్టెప్పా, మీరు మగాడు సార్ అంటే, ఏమిటి కొత్తగా కనుక్కున్నావా? అంటే లేదు కన్ ఫర్మ్ చేసుకున్నా, ఇలా చకచకా చాలా డైలాగ్ లు పేలాయి ట్రయిలర్ లో. మొత్తం మీద ఇంద్రగంటి తన స్టయిల్ క్లాసిక్ కామెడీని మరోసారి ట్రయ్ చేస్తున్నట్లు కన్ ఫర్మ్ చేసింది ట్రయిలర్.