cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Press Releases

మళ్లీ పరమానందుల శిష్యులు

మళ్లీ పరమానందుల శిష్యులు

పరమానందయ్య శిష్యుల కథ ఎప్పటికీ తెలుగు ప్రజలకు ఆసక్తికరమైన కథాంశమే. అప్పటి పరమానందయ్య శిష్యుల కథ తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ సుపరిచితమే, ఈ నేపథ్యంలో పింక్ రోజ్ సినిమాస్ పతాకంపై కాటంరెడ్డి సంతన్ రెడ్డి, సిహెచ్ కిరణ్ శర్మ నిర్మాతలుగా వెంకట రాజేష్ పులి దర్సకత్వంలో మళ్లీ మరోసారి తెరకెక్కిన చిత్రం శ్రీ పరమానందయ్య శిష్యుల కథ.

అయితే ఈసారి స్పెషాలిటీ ఏమిటంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడించడం. త్రీడీ టెక్నాలజీలో నిర్మించారు. తాజాగా ఈ సినిమా టీజర్ ని డైరెక్టర్ మారుతి విడుదల చేశారు. ఈ సందర్బంగా మారుతి మాట్లాడుతూ చిన్నారుల కోసం, పిల్లలకు నచ్చేలా ఇప్పుడున్న టెక్నాలజీ వాడుకొని మనందరికీ తెలిసిన పరమానందయ్య శిష్యుల కథను కొత్తగా చూపించే ప్రయత్నం చేసినందుకు ఈ చిత్ర బృందాన్ని అభినందించాలని అన్నారు. పిల్లలతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు.

ఆర్టీసీ సమ్మె తో కేసీఆర్ పతనం మొదలైందా?