cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Press Releases

మిస్ మ్యాచ్ మంచి సినిమా

మిస్ మ్యాచ్ మంచి సినిమా

మిస్ మ్యాచ్  మంచి సినిమా అని, మంచి మెసేజ్ తో తయారైన ఈ సినిమా మంచి హిట్ కావాలని తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీశ్ రావు అన్నారు.

ఉద‌య్ శంక‌ర్‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరో హీరోయిన్లుగా తయారైన  `మిస్ మ్యాచ్‌` ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హ‌రీశ్‌రావు, స్టార్ హీరో విక్ట‌రీ వెంక‌టేశ్ ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. 

బిగ్‌సీడీని తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హ‌రీశ్‌రావు, స్టార్ హీరో విక్ట‌రీ వెంక‌టేశ్ విడుద‌ల చేశారు. బిగ్ టికెట్‌ను విక్ట‌రీ వెంకటేశ్ లాంచ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా..తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ - ``శ్రీరామ్ పై ఉన్న గౌర‌వంతో నేను ఇక్క‌డ‌కు వ‌చ్చాను. ఇప్పుడు సినిమాల్లో కొత్త భావ‌న‌లు చోటు చేసుకుంటున్నాయి.  కొత్త క‌థ‌ల‌తో, కొత్త ద‌ర్శ‌కులు, అద్భుత‌మైన విజ‌యాల‌ను సాధిస్తున్నారు. 'మిస్ మ్యాచ్' కూడా అదే కోవ‌లో క‌న‌ప‌డుతుంది. 'మిస్ మ్యాచ్` స‌మాజంతో మ్యాచ్ కావాలని, మంచి విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

విక్ట‌రీ వెంక‌టేశ్ మాట్లాడుతూ - ``ఈ సినిమాలో ప‌నిచేసిన ప్ర‌తి ఒక ఆర్టిస్ట్‌, టెక్నీషియ‌న్ నా హృద‌యానికి ఎంతో ద‌గ్గ‌రైనవారు. వారంద‌రికీ ఆల్ ది బెస్ట్‌. ఉద‌య్‌శంక‌ర్, ఐశ్వ‌ర్యారాజేష్ లకు అభినంద‌న‌లు. నిర్మాత‌లు భ‌ర‌త్‌, శ్రీరామ్‌కు అభినంద‌న‌లు.  ఈ సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడుతూ - ``ఉద‌య్‌శంక‌ర్ గురించి నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఐశ్వ‌ర్యా రాజేష్ గురించి చెప్పాలంంటే ఆవిడ అమ్మ‌గారు గురించి చెప్పాలి. ఆవిడ ఎంతో క‌ష్ట‌ప‌డి ఎదిగారు. నిర్మ‌ల్ కుమార్ తొలి సినిమా స‌లీమ్‌ను చ‌క్క‌గా తెర‌కెక్కించాడు` అన్నారు.

ప్ర‌ముఖ ర‌చ‌యిత సీతారామ శాస్త్రి మాట్లాడుతూ - ``నేను గురువుగా భావించే శ్రీరామ్‌ సార్‌ కి శిర‌స్సు వంచి ప్రణామాలు. ఆయ‌న త‌న‌యుడి చిత్రోత్స‌వానికి రావ‌డం సంతోషంగా భావిస్తున్నాను.  నిర్మ‌ల్ కుమార్‌ మంచి డైరెక్ట‌ర్‌. ఆయ‌న‌కు తెలుగు చిత్ర‌సీమ‌లోకి ఆహ్వానం ప‌లుకుతున్నాం.  నిర్మాత‌ల‌కు అభినంద‌నలు`` అన్నారు.

ముఖ్య‌మంత్రి కార్యాల‌య ప్ర‌త్యేకాధికారి(ఓఎస్‌డీ) దేశ‌ప‌తి శ్రీనివాస్, డైరెక్ట‌ర్ డాలీ, దర్శహకుడు చంద్ర సిద్ధార్ధ, నిర్మాత కె.ఎల్. దామోదర ప్రసాద్ , హీరో శ్రీవిష్ణు, చిత్ర హీరో ఉదయ్ శంకర్, కథానాయిక ఐశ్వర్య రాజేష్, రచయిత భూప‌తి రాజా, దర్శకుడు నిర్మల్ కుమార్, నిర్మాతలు నిర్మాత‌లు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్  తదిరులు ప్రసంగించారు.