cloudfront

Advertisement


Home > Movies - Press Releases

మిస్ మ్యాచ్ టీజర్ విడుదల

'అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' సంస్థ తమ తొలి చిత్రం గా 'మిస్ మ్యాచ్' పేరుతొ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది.  ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్  నాయికగా నటిస్తున్నారు. తమిళ దర్శకుడు ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మిస్ మ్యాచ్ చిత్ర టీజర్ ను విక్టరీ వెంకటేష్ విడుదల చేసారు. 

ఈ సందర్బంగా విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ...మిస్ మ్యాచ్ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. చిత్ర యూనిట్ కు అభినందనలు.  మిస్ మ్యాచ్  ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ సినిమా అవుతుందని భావిస్తున్నాను. హీరో ఉదయ్ శంకర్ కు నటుడిగా మంచి భవిష్యత్ ఉంది " అన్నారు.

డైరెక్టర్ ఎన్.వి.నిర్మల్ మాట్లాడుతూ... విక్టరీ వెంకటేష్ మా చిత్ర టీజర్ ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం అందరికి నచ్చుతుందని భావిస్తున్నఅన్నారు. హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ ''నా మొదటి సినిమా ఆటకథరా శివ సినిమాకు వెంకటేష్ గారు సపోర్ట్ చేశారు. మళ్ళీ ఈ సినిమా టీజర్ ఆయన చేతుల మీదుగా విడుదలవ్వడం సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం అందరూ కష్టపడి పనిచేశారు.'' అన్నారు.

నిర్మాత శ్రీరామ్ మాట్లాడుతూ...విక్టరీ వెంకటేష్ ఈ టీజర్ రిలీజ్ చెయ్యడం హ్యాపీ గా ఉంది. ఆడియన్స్ కోరుకుంటున్న అన్నీ అంశాలు సినిమాలో ఉంటాయి. సినిమా బాగా వచ్చింది. డైరెక్టర్ ఎన్.వి.నిర్మల్ బాగా తీశారు. ఉదయ్ శంకర్, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ చక్కగా నటించారు. త్వరలో ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియజేస్తాము"అన్నారు.

బాబు భ్రమలను నమ్మని జనం.. వికేంద్రీకరణకే జగన్‌ మొగ్గు?