cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Press Releases

మిస్ మ్యాచ్..పెర్ ఫెక్ట్ సక్సెస్

మిస్ మ్యాచ్..పెర్ ఫెక్ట్ సక్సెస్

ఈవారం విడుదలైన మిస్ మ్యాచ్ సినిమా కు సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ మీట్ లో యూనిట్ సభ్యులు అందరూ పాల్గొని ప్రసంగించారు.

చిత్ర నిర్మాత శ్రీరామరాజు  మాట్లాడుతూ - "మా బేనర్ లో తొలి చిత్రమిది. అన్ని వర్గాల ఆడియెన్స్ సినిమా బాగుందని ప్రశంసిస్తున్నారు. థియేటర్లో సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కుటుంబంతో కలిసి చూసి ఎంకరేజ్ చేయాలని  ప్రేక్షకులను కోరుకుంటున్నా" అన్నారు. 

కథా రచయిత భూపతి రాజా మాట్లాడుతూ - "ఓ చిన్న సినిమాగా దీన్ని ప్రారంభించాం విడుదలైన తర్వాత పెద్ద చిత్రమైంది. రెండు కుటుంబాల జర్నీని తెలియజేస్తుంది. ఓ జంట స్వచ్ఛమైన ప్రేమ ఆ రెండు కుటుంబాలని ఎలా కలిపిందనేది ముఖ్య కథ మీ అందరి సపోర్ట్ కావాలి" అన్నారు.

దర్శకుడు నిర్మల్ కుమార్ మాట్లాడుతూ - "చిన్న సినిమాకి ఇంతటి స్పందన ని ఊహించలేదు. నా మొదటి సినిమాను కూడా బాగా ఆదరించారు. ఇప్పుడు రెండవ చిత్రాన్ని ఆదరిస్తున్న తెలుగు ఆడియెన్స్ కి పెద్ద థ్యాంక్స్,"  అన్నారు.

హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ - "ఈశుక్రవారం మూడు మ్యాచ్ లో గెలిచాం. ఒకటి 'దిశ నిందితుల ఎన్‌కౌంటర్, రెండు టీమ్  ఇండియా క్రికెట్ లో గెలవడం, మూడు మా సినిమా పెద్ద సక్సెస్ కావడం. సినిమాకు అన్ని వర్గాల ఆడియన్స్  నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.  సినిమాని థియేటర్లో చూసి మరింతగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా" అన్నారు.

 


×