cloudfront

Advertisement


Home > Movies - Press Releases

మిస్టర్ కె..కె గా విక్రమ్

మిస్టర్ కె..కె గా విక్రమ్

శివ‌పుత్రుడు, అప‌రిచితుడు చిత్రాల‌తో తెలుగు లో స్టార్ ఇమేజ్ ని సోంతం చేసుకున్నాడు విక్రమ్. ఇప్పుడు అదే విక్రమ్ క‌థానాయ‌కుడిగా అక్షర‌హ‌స‌న్‌, అభిహ‌స‌న్ కీల‌క పాత్రల్లో రాజేష్ ఎంసెల్వ ద‌ర్శక‌త్వంలో త‌మిళంలో హీరో కమల్ హాసన్ నిర్మించిన సినిమా మిస్టర్ కె. కె. వాస్తవానికి ఈ సినిమా తమిళ టైటిల్ క‌ద‌ర‌మ్ కొండ‌న్. ఈ చిత్రాన్ని తెలుగు లో నిర్మాత‌లు టి.న‌రేష్ కుమార్‌, టి. శ్రీధ‌ర్ లు సంయుక్తంగా పారిజాత మూవీ క్రియెష‌న్స్ బ్యాన‌ర్ పై విడుద‌ల చేస్తున్నారు. 

ఈ చిత్రం పూర్తి యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్ గా థ్రిల్ ని అందించే విధంగా ద‌ర్శకుడు తెర‌కెక్కించాడు.  ఈ చిత్రానికి తెలుగు లో మిస్టర్ కెకె అనే టైటిల్ ని ఎనౌన్స్  ట్రైల‌ర్ ని విడుద‌ల చేశారు. లోక‌నాయ‌కుడు ప‌ద్మభూషణ్ శ్రీ క‌మ‌ల్‌హ‌స‌న్ గారు త‌మిళ ట్రైల‌ర్ ని విడుద‌ల చేయ‌గా, అక్షర హ‌స‌న్ తెలుగు వెర్షన్ ట్రైల‌ర్ ని విడుద‌ల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత‌లు టి.న‌రేష్ కుమార్ అండ్ టి శ్రీధ‌ర్ లు మాట్లాడుతూ..  మాలో మంచి చిత్రాలు చేయాల‌నే మా ప్రయ‌త్నానికి తెలుగు ప్రేక్షకుల ఆశీశ్శులు బ‌లంగా వున్నాయి. ఇటీవ‌లే కిల్లర్ చిత్రం మంచి క‌మ‌ర్షియ‌ల్ విజ‌యాన్ని సాధించింది. ఇప్పడు త‌మిళం లో నిర్మిణ‌మైన క‌ద‌ర‌మ్ కొండ‌న్ చిత్రాన్ని తెలుగు లో మిస్టర్ కెకె అనే పేరుతో విడ‌దుల చేస్తున్నాము.

ట్రైల‌ర్ లో విక్రమ్ గెట‌ప్ గాని ఆయ‌న లుక్ అదిరిందని అంద‌రూ ఒకేమాట చెబుతున్నారు. అలాగే విజువ‌ల్ గ్రాండియ‌ర్ గా క‌నిపించిన ఈ చిత్రం గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే రిలీజ్ చేసిన ట్రైల‌ర్ లోనే క‌నిపించ‌టం విశేషం. అలాగే అక్షర హ‌స‌న్ కూడా పెర్‌ఫార్మెన్స్ స్కోప్ వున్న పాత్రలో క‌నిపించింది. ట్రైల‌ర్ లో యాక్షన్ ఎక్కువ చూపించినా థ్రిల్లింగ్ ఎపిసోడ్స్‌ చాలా వున్నాయి. అవ‌న్ని చూడాలంటే దియెట‌ర్స్ లోనే చూడాలి.

ఇక ఈ చిత్రానికి ప్రముఖ ర‌చ‌యిత శ‌శాంక్ వెన్నెల‌కంటి అద్భుత‌మైన డైలాగ్స్ అందించారు, అలానే రామ జోగ‌య్య శాస్త్రీ లిరిక్స్ ఆడియెన్స్ ని ఆక‌ట్టుకునే రీతిన ఉంటాయి, అతి త్వర‌లో డేట్ ఎనౌన్స్ చేస్తాము.. అని అన్నారు.

దొరసాని మనసెరిగిన దొర.. ఏమి చెప్పాడో తెలుసా?