cloudfront

Advertisement


Home > Movies - Press Releases

నాగశౌర్య-మెహరీన్ సినిమా ప్రారంభం

నాగశౌర్య-మెహరీన్ సినిమా ప్రారంభం

నాగ‌శౌర్య త‌న స్వంత బ్యాన‌ర్ ఐరా క్రియేష‌న్స్‌లో చలో, నర్తనశాల నిర్మిస్తున్న చిత్రానికి ఈరోజు ముహుర్తం చేసారు. ఈ  చిత్రంతో రమణతేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శంక‌ర్ ప్రసాద్ స‌మ‌ర్పణ‌లో ఉషాముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రంలో మెహరీన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు కె.రాఘ‌వేంద్రరావు క్లాప్ కొట్టి  స్క్రిప్ట్ ని డైరెక్టర్ రమణ తేజకు అందించగా ప‌ర‌శురామ్ గౌర‌వ‌ద‌ర్శక‌త్వం వహించారు. దర్శకురాలు నందినిరెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో.

హీరో నాగశౌర్య మాట్లాడుతూ - "న‌న్ను ఆశీర్వదించ‌డానికి వ‌చ్చిన పెద్దలు కె. రాఘ‌వేంద్రరావు, ప‌ర‌శురామ్‌, నందినిరెడ్డి గారికి నా ప్రత్యేక కృత‌జ్ఞత‌లు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే 13నుంచి మొద‌లవుతుంది. 70శాతం షూటింగ్ వైజాగ్‌లో చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాం. ర‌మ‌ణ‌తేజ ఈ చిత్రంతో ద‌ర్శకుడుగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. నా ఫ్రెండ్, మేం ఇద్దరం క‌లిసి యు.ఎస్‌.లో బూస్టన్ ఫిల్మ్ స్కూల్లో క‌లిశాం. మంచి క‌థ డెఫినెట్ గా బాగా తీస్తార‌ని ఆశిస్తున్నాను. మెహ్రీన్‌తో క‌లిసి ప‌నిచేయ‌డం ఇదే మొద‌టిసారి అన్నారు.

హీరోయిన్ మెహ్రీన్ మాట్లాడుతూ - "మా డైరెక్టర్‌, ప్రొడ్యూస‌ర్స్‌కి నా థ్యాంక్స్‌. మా టీమ్ అంద‌రికీ ఆల్ ద బెస్ట్ మీ అంద‌రి బ్లెస్సింగ్స్ మాకు కావాలి "అన్నారు. 

చిత్ర ద‌ర్శకుడు రమణ తేజ మాట్లాడుతూ - " నాకు ఈ సినిమా ఇచ్చిన మా శౌర్య అన్నయ్యకు చాలా థ్యాంక్స్. న‌న్ను న‌మ్మి నాకు ఇంత మంచి క‌థ ఇచ్చి డైరెక్టర్‌గా నిల‌బెట్టిన ప్రొడ్యూస‌ర్స్‌కి నా ప్రత్యేక ధ‌న్యవాదాలు. కెమెరామెన్ మ‌నోజ్‌ నాకు మంచి మిత్రుడు. ఇద్దరం అదే ఫిలిం స్కూల్ లో చదివాము. అన్నారు. 

మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల మాట్లాడుతూ - "క‌థ చాలా వైబ్రెంట్‌గా ఉంటుంది. ఆల్రెడీ వ‌ర్క్ స్టార్ట్ అయింది. సినిమా చాలా బావుంటుంది" అన్నారు.

నాగ‌శౌర్య కొత్త సినిమా ప్రారంభ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి