Advertisement


Home > Movies - Press Releases
నాగార్జున విడుద‌ల చేసిన‌ తరుణ్ సినిమా టీజ‌ర్‌

అభిరామ్ స‌మ‌ర్ప‌ణ‌లో రామ్ ఎంట‌ర్‌టైన‌ర్స్ బ్యాన‌ర్‌పై త‌రుణ్‌, ఓవియా హీరో హీరోయిన్లుగా రమేష్‌, గోపి ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.వి.ప్ర‌కాష్ నిర్మిస్తోన్న చిత్రం `ఇది నా ల‌వ్‌స్టోరీ`.ప్ర‌స్తుతం సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమా టీజ‌ర్ ఈరోజు కింగ్ నాగార్జున విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా...

కింగ్ నాగార్జున మాట్లాడుతూ - ```ఇది నా ల‌వ్‌స్టోరీ, టైటిల్ చాలా బావుంది. టీజ‌ర్ చాలా ఫ్రెష్‌గా ఉంది. త‌రుణ్ లుక్ అంద‌రికీ న‌చ్చుతుంది. ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యి ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు, హీరో త‌రుణ్‌కు మంచి సినిమా కావాల‌ని కోరుకుంటున్నాను. ఎంటైర్ టీంకు అభినంద‌న‌లు`` అన్నారు.

చిత్ర నిర్మాత ఎస్‌.వి.ప్ర‌కాష్ మాట్లాడుతూ - ``క‌న్న‌డంలో సూప‌ర్‌హిట్ అయిన చిత్రాన్ని తెలుగులో `ఇది నా ల‌వ్‌స్టోరీ` అనే పేరుతో రీమేక్ చేశాం. ఒక అమ్మాయిని ఎంత కాలం ప్రేమించామ‌నేది ముఖ్యం కాదు, ఎంతగా ప్రేమించామనేదే మ‌ఖ్యం ..అనేదే ఈ సినిమా మెయిన్ క‌థాంశం. తెలుగు ఆడియెన్స్ టెస్ట్‌కు త‌గిన విధంగా, నెటివిటీకి అనుగుణంగా క‌థ‌లో మార్పులు చేర్పులు చేశాం.  అవుటండ్ అవుట్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా చాలా బాగా వ‌చ్చింది. త‌రుణ్, ఓవియా అద్భుతంగా న‌టించారు. నాగార్జున‌గారు టీజ‌ర్‌ను విడుద‌ల చేసి మ‌మ్మ‌ల్ని అప్రిసియేట్ చేయ‌డం మాకెంతో ఎన‌ర్జీనిచ్చింది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను త్వ‌ర‌లోనే విడుద‌ల చేస్తాం`` అన్నారు.