cloudfront

Advertisement


Home > Movies - Press Releases

నర్తనశాల మాంచి ఎంటర్ టైనర్-నాగశౌర్య

నర్తనశాల మాంచి ఎంటర్ టైనర్-నాగశౌర్య

ఛ‌లో లాంటి బ్లాక్‌బ‌స్టర్ చిత్రం త‌రువాత నాగ‌శౌర్య‌, ఐరా క్రియోష‌న్స్ కాంబినేష‌న్ లో ప్రోడ‌క్షన్ నెం-2గా తెర‌కెక్కుతున్న చిత్రం @న‌ర్తన‌శాల. ఈ చిత్రం మెద‌టి లుక్ ని విడుద‌ల చేశారు. ఈ కార్యక్రమాన్ని ఫోరమ్ మాల్ లో ఓపెన్ ఈవెంట్ గా నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో హీరోయిన్స్ క‌ష్మిర ప‌ర‌దేశి, యామిని భాస్కర్‌, శివాజి రాజా, జెమిని సురేష్‌, రాఘ‌వ‌, రాకెట్ రాఘ‌వ‌, త‌దిత‌రులు హ‌జ‌రవ్వగా, కొరియోగ్రాఫ‌ర్ విజ‌య్‌, సినిమాటోగ్రఫి విజ‌య్ సి కుమార్‌, లైన్ ప్రోడ్యూస‌ర్ బుజ్జి, లిరిక్ రైట‌ర్స్ ఓరుగంటి, శ్రీమ‌ణిలు హ‌జ‌ర‌య్యారు.

ఈ చిత్రానికి క్రియోటివ్ ద‌ర్శకుడు కృష్ణవంశి ద‌గ్గర ద‌ర్శక‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన శ్రీనివాస చ‌క్రవ‌ర్తి ద‌ర్శకుడు, చిత్ర స‌మ‌ర్పకుడు శంక‌ర ప్రసాద్ మూల్పూరి, చిత్ర నిర్మాత ఉష మూల్పూరి. ఈ కార్యక్రమాన్ని చూప‌రుల‌ను ఆక‌ట్టుకునేలా డిజైన్ చేశారు. 

ఈ సందర్భంగా హీరో నాగశౌర్య మాట్లాడుతూ. లెజెండ‌రి చిత్రం న‌ర్తన‌శాల పేరు ఏమాత్ర పాడుచేయ్యకుండా నిల‌బెట్టెలా  చిత్రాన్ని చేశాము. చిత్రం కూడా అంద‌ర్ని ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. త్వ‌ర‌లో మాంచి టీజర్, ట్రయిలర్ తో మీ ముందుకు వ‌స్తాము.. అన్నారు.

దర్శకుడు శ్రీనివాస చక్రవర్తి మాట్లాడుతూ @న‌ర్తన‌శాల చిత్రం చాలా బాగా వ‌చ్చిందని, ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వుంటుందని అన్నారు. హీరోయిన్ కష్మీరా మాట్లాడుతూ చాలా మంచి చిత్రంతో ప‌రిచ‌యం అవుతున్నందుకు చాలా ఆనందంగా వుంది. అన్నారు.

మరో హీరోయిన్ యామిని భాస్కర్ మాట్లాడుతూ ఈ చిత్రం యూనిట్ అంద‌రికి చాలా మంచి పేరు వ‌స్తుంది. అలానే ఈ చిత్రంలో నటించిన వారందరికీ మంచి పాత్రలు దొరికాయి అన్నారు