cloudfront

Advertisement


Home > Movies - Press Releases

నేటితరం చిత్రం `4 లెట‌ర్స్‌`

నేటితరం చిత్రం `4 లెట‌ర్స్‌`

ఓం శ్రీ చ‌క్ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్న తొలి చిత్రం `4 లెట‌ర్స్‌`. 'కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే' అన్నది ఉప శీర్షిక. ఈశ్వ‌ర్‌, టువ చ‌క్ర‌వ‌ర్తి, అంకిత మ‌హారాణా హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని ఆర్‌.ర‌ఘురాజ్ ద‌ర్శ‌కత్వంలో దొమ్మ‌రాజు హేమ‌ల‌త‌, దొమ్మ‌రాజు ఉద‌య్‌కుమార్ నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది.

ఈ సంద‌ర్భంగా...నిర్మాత‌లు దొమ్మ‌రాజు హేమ‌ల‌త‌, దొమ్మ‌రాజు ఉద‌య్‌కుమార్ మాట్లాడుతూ - ``మా బ్యాన‌ర్‌లో నిర్మిస్తోన్న తొలి చిత్రం `4 లెట‌ర్స్‌`. ఈ చిత్రం ద్వారా ఈశ్వ‌ర్‌ను హీరోగా ప‌రిచ‌యం చేయ‌డం ఆనందంగా ఉంది. చాలా చ‌క్క‌గా న‌టించాడు. స‌త్యానంద్‌గారి వ‌ద్ద శిక్ష‌ణ తీసుకున్న ఈశ్వ‌ర్.. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వ‌ర్క్ చేశారుఅలాగే `కలుసుకోవాల‌ని` వంటి బ్యూటీఫుల్, క్యూట్ ల‌వ్ స్టోరీని తెరకెక్కించి అంద‌రి మ‌న్న‌న‌లు పొందిన ద‌ర్శ‌కుడు చాలా గ్యాప్ త‌ర్వాత తెలుగులో చేస్తున్న చిత్రమిది అన్నారు.

ద‌ర్శ‌కుడు ఆర్.ర‌ఘురాజ్ మాట్లాడుతూ ```క‌లుసుకోవాల‌ని` త‌ర్వాత క‌న్న‌డ‌, త‌మిళ సినిమాల‌తో బిజీగా మారిపోయాను. చాలా గ్యాప్ త‌ర్వాత తెలుగులో నేను డైరెక్ట్ చేసిన మూవీ. నేటి ట్రెండ్‌కు త‌గ్గ‌ట్లు సినిమాను తెర‌కెక్కించాను. ఒక రకంగా చెప్పాలంటే `4 లెట‌ర్స్‌`: నేటితరం ప్రేమకథాచిత్రం. అందుకే 'కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే' అన్నది ఉప శీర్షిక గా పెట్టాము.

హీరో ఈశ్వ‌ర్ చ‌క్క‌గా న‌టించాడు. త‌న‌కు మంచి ఫ్యూచ‌ర్ ఉంటుంది. హీరోయిన్స్ టువ చ‌క్ర‌వ‌ర్తి, అంకిత మ‌హారాణాలు చ‌క్క‌గా న‌టించారు. హైద‌రాబాద్‌లో టాకీ పార్ట్‌ను, బ్యాంకాక్‌లో సాంగ్స్‌ను చిత్రీక‌రించాం. నిర్మాత‌లు మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా స‌పోర్ట్ చేయ‌డంతో సినిమాను అనుకున్న ప్ర‌ణాళిక ప్ర‌కారం పూర్తి చేశాం`` అన్నారు. 

న్యూ ఇయర్ స్పెషల్ చదవండి ఈ వారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

కేంద్రంలో పవన్ కళ్యాణ్ ప్రయాణం ఎటువైపు