cloudfront

Advertisement


Home > Movies - Press Releases

నిను వీడని స్పందన బాగుంది.. అన్యాసింగ్

నిను వీడని స్పందన బాగుంది.. అన్యాసింగ్

సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించి, నిర్మించిన చిత్రం 'నిను వీడని నీడను నేనే'.  కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు అన్యా సింగ్ కథానాయికగా పరిచయం అయ్యారు. విడుదలైన రోజు నుంచి చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో అన్యా సింగ్ మీడియాతో ముచ్చటించారు.

' సినిమా మంచి రెస్పాన్స్ వస్తోంది.  చూసిన ప్రతి ఒక్కరూ బావుందని చెబుతున్నారు. ఫస్టాఫ్ సూపర్ గావుందని, అలాగే క్లైమాక్స్ లో ఎమోషనల్ సీన్స్ తమ మనసును కదిలించాయని చెబుతున్నారు.  బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు బాగున్నాయి. థియేటర్ల సంఖ్య ను పెంచుతున్నారు. ఇంతకన్నా ఏం కావాలి. ఐ యాం సో హ్యాపీ.'' అన్నారు అన్యాసింగ్.

'తొలి సినిమాలోనే కాస్త నటనకు అవకాశం వున్న పాత్ర దొరకడం హ్యాపీగా వుంది.  హారర్ సన్నివేశాల్లో ఈజీగానే నటించేశా. కానీ, ఎమోషనల్ సన్నివేశాలు చేసేటప్పుడు కొంచెం కష్టపడ్డాను. నిజానికి నాకు హర్రర్ సినిమాలు అంటే కాస్త భయం. అయితే ఈ  సినిమాలో హారర్ సన్నివేశం ఒక్కటే ఉంది. అది చేసేటప్పుడు చుట్టూ జనాలు ఉన్నారు. అయినా... రాత్రిపూట తీయడంతో కొంచెం టెన్షన్ పడ్డాను' అంటూ వివరించారు. 

'షూటింగ్ జరిగేటప్పుడు సందీప్ కిషన్ ఎంతో హెల్ప్ చేశాడు. నాకు డైలాగులు అర్థం కాకపోతే వివరించి చెప్పేవాడు.  అతనితో పాటు మా దర్శకుడు కార్తీక్ రాజు కూడా నాకు బాగా సహకరించారు. హిందీలో ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ తో మూడు సినిమాల అగ్రిమెంట్ ఉంది. ఒక సినిమా చేశా. త్వరలో మిగతా రెండు చేస్తా.  మంచి కథ, పాత్ర లభిస్తే నేను ఏ భాషలోనైనా నటించడానికి సిద్ధమే' అంటూ ముగించారు అన్యాసింగ్.

టీడీపీ స్థానాన్ని బీజేపీ ఆక్రమించగలదా?