cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Press Releases

‘ఓ పిట్టకథ’ పెద్ద హిట్ కావాలి - మెగాస్టార్

‘ఓ పిట్టకథ’ పెద్ద హిట్ కావాలి -  మెగాస్టార్

విశ్వంత్‌ దుద్దంపూడి, సంజయ్‌ రావు, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ నటించిన చిత్రం ‘ఓ పిట్టకథ’.  చెందు ముద్దు దర్శకుడు. ఈ నెల 6న చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.  ‘‘హీరోగా పరిచయమవుతున్ననటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌, మరో హీరో విశ్వంత్‌, హీరోయిన్ నిత్యాకి మంచి భవిష్యత్తు ఉండాలి. భవన నిర్మాణ రంగంలో ఆనందప్రసాద్‌గారు ఎంత సక్సెస్‌ అయ్యారో... చిత్రసీమలోనూ అంతే సక్సెస్‌ కావాలి '' అని అన్నారు.

సీనియర్ యాక్టర్ బ్రహ్మాజీ మాట్లాడుతూ ''..సమయం విలువ, డబ్బుల విలువ, నటన పై ఆసక్తి మెగాస్టార్ ను చూసి ఈ తరం వాళ్ళు ఎంతో నేర్చుకోవాలి. ఆయన ఈ చిత్రం ఈవెంట్ కి వచ్చారంటేనే సగం విజయం సాధించినట్టే. ఆయనది గోల్డెన్ లెగ్'' అని అన్నారు.

ప్రొడ్యూసర్ ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ "కొత్తవాళ్లతో మేం చేసిన ప్రయత్నానికి నిండు మనసుతో ఆశీర్వదించడానికి వచ్చిన చిరంజీవిగారికి రుణపడి ఉంటాం. చిత్రసీమలో ఏ సమస్య వచ్చినా పెద్ద దిక్కుగా ఉండి పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు.అలాగే మా అన్ని చిత్రాల లాగే 'ఓ పిట్ట కథ' కూడా అన్ని విధాలుగా మిమ్మల్ని అలరిస్తుందని నమ్ముతున్నాం" అన్నారు.

హీరో  విశ్వంత్‌ దుద్దుంపూడి   మాట్లాడుతూ " చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నటించాలన్న కోరికనుండి మొదలు, ఇలా మెగాస్టార్ గారి పక్కన స్టేజ్ పై ఉండాలన్న కోరిక వరకు అన్ని తీరిపోతున్నాయి" అన్నారు.

హీరోయిన్ నిత్యా మాట్లాడుతూ  '' ఈ చిత్రంలో మంచి పాత్రనించిన దర్శకుడు చెందు గారికి , నా ప్రతిభని నిరూపించుకోడానికి ఒక మంచి వేదికనిచ్చిన భవ్య క్రియేషన్స్ కి చాలా థాంక్స్ " అన్నారు.

హీరో సంజయ్ మాట్లాడుతూ "భవ్య క్రియేషన్స్ వాళ్ళు మాలాంటి కొత్తవాళ్ళకి నిరూపించుకోడానికి ఒక వేదిక ఇచ్చారు, అందుకు భవ్య ఆనంద ప్రసాద్ , అన్నే రవి కి ధన్యవాదాలు" అన్నారు.

డైరెక్టర్ చెందు ముద్దు మాట్లాడుతూ "నా బ్యాక్ గ్రౌండ్ తో సంబంధం లేకున్నా, భవ్య క్రియేషన్స్ లాంటి ఒక వేదికానిచ్చారు.  ప్రతి సారి నా ఫేవరెట్ డైరెక్టర్ చంద్ర శేఖర్ యేలేటి గారు చాల సపోర్ట్ చేసారు, మా కెమరామెన్ సునీల్ చాల బెస్ట్ ఇచ్చారు " అన్నారు.

లిరికిస్ట్ శ్రీజో, కమెడియన్ సునీల్, హీరో సందీప్ కిషన్, యాంకర్ అనసూయ, నటుడు సత్యదేవ్, డైరెక్టర్ సాగర్ చంద్ర , హీరో ఆనంద్ దేవరకొండ దర్శకులు చంద్ర శేఖర్ యేలేటి, కెమెరామాన్ సునీల్‌ కుమార్‌ యన్‌ తదితరులు పాల్గొన్నారు. 

అన్నయ్య గురుంచి ఎవడైనా బ్యాడ్ గా మాట్లాడితే చంపేస్తా

కేసీఆర్ ఆదేశించారు మా ప్రయత్నం మేము చేస్తున్నాం