cloudfront

Advertisement


Home > Movies - Press Releases

అనగనగా ఓ ప్రేమకథ టీజర్ విడుదల

అనగనగా ఓ ప్రేమకథ టీజర్ విడుదల

విరాజ్.జె.అశ్విన్ ను హీరోగా, రిద్ధి కుమార్ మరియు రాధా బంగారు లను హీరోయిన్లుగా  పరిచయం చేస్తూ 'అనగనగా ఓ ప్రేమకథ'' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి విదితమే.  టి.ప్రతాప్ ఈ చిత్రం ద్వారా  దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా టీజరన్ ను హీరో రానా దగ్గుబాటి ఫేస్ బుక్ లో విడుదల చేసి చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు. ఇటీవలే ఈసినిమా కు సంబంధించి ఫస్ట్ లుక్ ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ చేశారు. 

ఒకప్పటి ప్రముఖ నిర్మాత డి వి ఎస్ రాజు  అల్లుడు కె.ఎల్.ఎన్ రాజు గారు  చాలా గ్యాప్ తర్వాత నిర్మాతగా థౌజండ్ లైట్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్యానర్ ను స్థాపించి ఈ  ‘అనగనగా ఓ ప్రేమకథ’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  'ఈసినిమా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపు కుంటోంది. అక్టోబర్ నెలలో విడుదల చేయటానికి సిద్ధం చేస్తున్నాము అని నిర్మాత కేఎల్ఎన్ రాజు తెలిపారు.

దర్శకుడు ప్రతాప్ మాట్లాడుతూ.'రాణా' గారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఈచిత్రం టీజర్ ను విడుదల చేయటం చాలా ఆనందంగా ఉంది అన్నారు.

హీరో విరాజ్ జె అశ్విన్ మాట్లాడుతూ 'రానా' తన ఈ తొలిచిత్రం టీజర్ ను తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేయటం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు.