cloudfront

Advertisement


Home > Movies - Press Releases

పందెంకోడి 3 తీస్తా-విశాల్

పందెంకోడి 3 తీస్తా-విశాల్

మాస్‌ హీరోగా విశాల్‌ కథానాయకుడిగా ఎన్‌.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'పందెంకోడి 2'. లైట్‌హౌస్‌ మూవీ మేకర్స్‌ ఎల్‌ఎల్‌పి పతాకంపై ఠాగూర్‌ మధు సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్‌ 18న విడుదలై సూపర్‌ ఓపెనింగ్స్‌తో సెన్సేషనల్‌ హిట్‌ సాధించింది. 6 కోట్లకు కొన్న 'పందెంకోడి 2'.. 5 రోజులకే 5 కోట్ల 63 లక్షలకు పైగా షేర్‌ సాధించి బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ప్రేక్షకుల అపూర్వ ఆదరణతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.

ఈ సందర్భంగా మాస్‌ హీరో విశాల్‌ మాట్లాడుతూ '' నేను, లింగుస్వామి కథను నమ్మి ఈ సినిమా చేశాం.  ప్రేక్షకులు ఈ సినిమాను మేం ఊహించిన దానికంటే పెద్ద హిట్‌ చేశారు. నాకు ఆర్టిస్ట్‌గా మంచి పేరు  నిర్మాతగా మంచి విజయాన్ని ఇచ్చింది. ఈ విజయం స్ఫూర్తితో  'పందెంకోడి 3'ని ప్లాన్‌ చేస్తున్నాం '. అన్నారు.

కీర్తి సురేష్‌ మాట్లాడుతూ ''మహానటి' వంటి క్లాసిక్‌ మూవీ తర్వాత ఒక మంచి మాస్‌ క్యారెక్టర్‌ ఈ సినిమాలో చేశాను. ఈ క్యారెక్టర్‌ చేస్తున్నప్పుడే థ్రిల్‌ అనిపించింది. రిలీజ్‌ అయ్యాక నా పెర్‌ఫార్మెన్స్‌ని అందరూ అప్రిషియేట్‌ చెయ్యడం చాలా ఆనందం కలిగించింది. 'పందెం కోడి 2' అనేది నా కెరీర్‌లో ఓ స్పెషల్‌ మూవీ అయింది. ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్‌'' అన్నారు.

లింగుస్వామి మాట్లాడుతూ ''పందెంకోడి' కంటే పందెంకోడి 2'కి రెస్పాన్స్‌ టెరిఫిక్‌గా ఉంది. ఇంత పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులకు థాంక్స్‌. ఈ సినిమా కంటే పెద్ద రేంజ్‌లో 'పందెంకోడి 3' ఉండేలా స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్నాం'' అన్నారు.

ఠాగూర్‌ మధు మాట్లాడుతూ ''ఇంతటి మంచి హిట్‌ సినిమాని మాకు అందించిన విశాల్‌కి, లింగుస్వామికి, ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. ఈ దసరా పండగకు మా సంస్థకు మంచి విజయాన్ని అందించిన అందరికీ థాంక్స్‌'' అన్నారు.

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి