Advertisement


Home > Movies - Press Releases
పంతం బయ్యర్లంతా హ్యాపీ-రాధామోహన్

''అధినేత', 'ఏమైంది ఈవేళ', 'బెంగాల్‌ టైగర్‌' వంటి మంచి హిట్‌ చిత్రాల తర్వాత మా శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ బేనర్‌లో యాక్షన్‌ హీరో గోపీచంద్‌తో చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన 'పంతం'. ఈ చిత్రం అన్ని సెంటర్స్‌లో దిగ్విజయంగా 25 రోజులు పూర్తి చేసుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత రాధామోహన్ మాట్లాడుతూ  పంతం చిత్రం చూసి ప్రేక్షకులు చాలా మంది యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు మంచి మెసేజ్‌ ఇచ్చిన సినిమా అని అభినందించడం ఆనందాన్ని కలిగించిందన్నారు.  

అలాగే  చిత్రం కొన్న బయ్యర్లందరూ తమకు కమర్షియల్‌గా ఈ సినిమా చాలా హ్యాపీ ప్రాజెక్ట్‌ అయిందని చెప్పడం నిర్మాతగా నాకు ఎంతో సంతృప్తిని కలిగించింది. 'పంతం'లాంటి మంచి సినిమా చేసి విజయం సాధించినందుకు ఎంతో సంతోషంగా వుంది. ఈ విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను'' అన్నారు శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ అధినేత, సూపర్‌హిట్‌ చిత్రాల నిర్మాత కె.కె. రాధామోహన్‌.