cloudfront

Advertisement


Home > Movies - Press Releases

పేపర్ బాయ్ బాగుందంటున్నారు-సంపత్ నంది

పేపర్ బాయ్ బాగుందంటున్నారు-సంపత్ నంది

సంతోష్ శోభన్ , రియా సుమన జంటగా జయశంకర్ దర్శకత్వంలో సంపత్ నంది టీమ్ వర్క్స్ , ప్రచిత్ర క్రియేషన్స్ బ్యానర్లు పై సంపత్ నంది, రాములు, వెంకట్, నర్సింహులు సంయుక్తంగా నిర్మించిన చిత్రం "పేపర్ బాయ్". ఈ చిత్రం ఆగస్ట్31న వరల్డ్ వైడ్ గా రిలీజై రన్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ ధసపల్లా హోటల్లో సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్ట‌ర్ జ‌య‌శంక‌ర్ మాట్లాడుతూ ``మా సినిమా ప్రీ లుక్ నుండి ఇప్ప‌టి వ‌ర‌కు అంద‌రూ స‌పోర్ట్ చేస్తూ వ‌చ్చారు. సంప‌త్‌గారు న‌న్ను, సంతోశ్‌, రియా, మ‌హేశ్ విట్టా స‌హా కొత్త‌వాళ్ల‌ను ఆయ‌న బాగా ఎంక‌రేజ్ చేశారు. అన్నారు. 

హీరోయిన్ రియా సుమ‌న్ మాట్లాడుతూ ``పేప‌ర్ బాయ్‌ని సూప‌ర్‌హిట్ బాయ్‌ని చేసినందుకు థాంక్స్‌. సంప‌త్‌గారికి, జ‌య‌శంక‌ర్‌గారికి థాంక్స్‌. గోల్డెన్ ఆఫ‌ర్ అనుకుంటున్నాను. స‌పోర్ట్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు. 

హీరో సంతోశ్ శోభ‌న్ మాట్లాడుతూ - ``సినిమాను ఆద‌రించిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. కొత్త‌వాళ్ల‌కు అవ‌కాశం ఇచ్చిన సంప‌త్‌గారికి థాంక్స్‌. నిర్మాత‌గానే కాదు.. ర‌చ‌యిత‌గా కూడా ముందుండి న‌డిపించారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ ముర‌ళిగారికి, డైరెక్ష‌న్ టీంకి థాంక్స్‌`` అన్నారు. 

కథా రచయిత నిర్మాత సంప‌త్ నంది మాట్లాడుతూ - ``ఈరోజు ప్ర‌పంచ వ్యాప్తంగా పేప‌ర్‌బాయ్ దినోత్స‌వం. కాబ‌ట్టి పేప‌ర్‌బాయ్స్ అంద‌రికీ థాంక్స్‌. చాలా మంది ఫోన్ చేసి మంచి ప్ర‌య‌త్నం చేశాన‌ని అప్రిషియేట్ చేశారు. మా సినిమాలో స్టార్స్ ఎవ‌రూ లేరు. డీసెంట్ ప్ర‌య‌త్నం చేశాం. శుక్ర‌వారం నుండి ఆదివారం వ‌ర‌కు క‌లెక్ష‌న్స్‌తో పాటు థియేట‌ర్స్ కూడా పెరిగాయి. ఈ సంద‌ర్భంగా గీతాఆర్ట్స్ అల్లు అర‌వింద్‌గారికి థాంక్స్ చెబుతున్నాను. సౌంద‌ర్‌రాజ‌న్‌గారి వ‌ల్ల‌నే సినిమా ఇంత గ్రాండ్‌గా క‌న‌ప‌డుతుంది.

చాలా చిన్న ప్ర‌య‌త్న‌మిది. డైరెక్ట‌ర్ ప్రొడ్యూస్ చేస్తున్న‌ప్పుడు ఎవ‌రూ ఎంక‌రేజింగ్‌గా మాట్లాడ‌రు. నాకు అలాంటి మాట‌లే మాట్లాడారు. నేను డ‌బ్బులు సంపాదించాల‌నే ఆలోచ‌న‌ల‌తో ప్రొడ‌క్ష‌న్‌లోకి రాలేదు. ఇండ‌స్ట్రీ నాకు అవ‌కాశం ఇచ్చింది. నేను ఇండ‌స్ట్రీలో మ‌రొక‌రి అవ‌కాశం ఇస్తేనే ఇండ‌స్ట్రీ మ‌రో అవ‌కాశం ఇస్తుంద‌ని భావించే ప్రొడక్ష‌న్ చేశాను. ఈ ప్రొడ‌క్ష‌న్ ఇలానే కంటిన్యూ అవుతుంది. అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.