cloudfront

Advertisement


Home > Movies - Press Releases

ఎట్టాగయ్యా శివశివా అనిపించిన పవన్

ఎట్టాగయ్యా శివశివా అనిపించిన పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పోరాటయాత్రను ప్రారంభించిన తర్వాత.. సినిమాలు చేయడానికి మాత్రమేకాదు. సినిమా కార్యక్రమాలకు కూడా చాలా దూరంగా ఉన్నారు. ఇటీవలి కాలంలో ఆయన చాలా తక్కువగా మాత్రమే సినిమా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాంటిది భావాత్మక చిత్రాలకు పేరుపడ్డ చంద్రసిద్ధార్థ్ దర్శకత్వం వహించిన ‘ఆటగదరా శివా’ చిత్రంలోని ఒక పాటను ఆయన విడుదల చేయడం విశేషం. ‘ఆటగదరా శివా’ చిత్రం ఈనెల 20వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. ‘‘ఎట్టాగయ్యా శివ శివా నీవ‌న్నీ వింత ఆట‌లే.. పుట్టుక‌, చావు యాత‌న నువ్వు రాసే నుదుటి రాత‌లే...

నింగి నేల అంద‌రికొక‌టే వందాలోచ‌న‌లెందుకు...’’ అంటూ సాగే ఈ చిత్రంలోని భావగర్భితమైన ఒక పాటను పవన్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో యూట్యూబ్ ద్వారా విడుదల చేశారు.

రాక్ లైన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సెన్సిబుల్ డైరెక్టర్ చంద్ర సిద్ధార్థ్ ద‌ర్శక‌త్వంలో రాక్‌లైన్ వెంక‌టేశ్ నిర్మించిన చిత్రం `ఆట‌గ‌ద‌రా శివ‌`. జూలై 20న ఈ సినిమా విడుద‌ల‌వుతుంది. ఉరిశిక్ష నుంచి త‌ప్పించుకుని ఓ ఖైదీ బ‌య‌ట‌ప‌డ‌తాడు. అనుకోకుండా త‌న‌ను ఉరితీయాల్సిన తలారినే క‌లుస్తాడు. వాళ్లెవ‌ర‌న్న విష‌యం ప‌ర‌స్ప‌రం తెలియ‌క‌పోవ‌డంతో క‌లిసి ప్ర‌యాణం చేస్తారు. ఆ ప్ర‌యాణంలో వాళ్ల‌కు ఎదుర‌య్యే అనుభ‌వాలు ఏంటి?  వాళ్లు ఎవ‌రెవ‌రిని క‌లిశారు? అనే క‌థాంశంతో సినిమా ఆసాంతం ఆస‌క్తిక‌రంగా ఓ తాత్విక‌త‌తో  సాగే చిత్ర‌మిది. . క‌న్న‌డ‌లో విజ‌య‌వంత‌మైన `రామ రామ రే` చిత్రాన్ని ఆధారంగా  ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో పైన పెర్కొన్న పాట‌ను ప‌వ‌న్‌క‌ల్యాణ్ విడుద‌ల చేశారు. అనంత‌రం..

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట్లాడుతూ - ``చైత‌న్య ప్రసాద్‌గారి సాహిత్యం చాలా బావున్నాయి. నాకు బాగా న‌చ్చింది. వాసుకి వైభ‌వ్‌గారు కూడా రాసిన శివ‌త‌త్వం పాట నాకు చాలా బాగా న‌చ్చింది. హీరో ఉద‌య్‌శంక‌ర్ నాకు చిన్నప్పట్నుంచి తెలుసు. ఉద‌య్ నాన్నశ్రీరామ్‌గారు మాకు గురువు. మేం ఆయ‌న్ను సార్ అంటుంటాం. ఆయ‌న ఇంగ్లీష్ లెక్చ‌ర‌ర్‌.. నాకు ఆధ్యాత్మిక గురువు కూడా ఆయ‌న‌. గోకులంలో సీత సినిమా నుండి ఉద‌య్‌ను చూస్తున్నాను. ఉద‌య్ న‌టించిన చిత్రమే `ఆటగ‌దరా శివ‌` ఉరి శిక్ష ప‌డ్డ ఖైదీ జీవితానికి సంబంధించిన క‌థాంశం. డైరెక్టర్ చంద్ర సిద్ధార్థ గారు డైరెక్ట్ చేసిన `ఆ న‌లుగురు` వంటి సినిమాలు యూనిక్‌గా ఉంటాయి. ఈ సినిమా విజువ‌ల్స్ చూస్తుంటే కొత్తగా, డిఫ‌రెంట్‌గా అనిపిస్తుంది. ఉద‌య్ శంక‌ర్ పాత్ర కూడా నాకు కొత్త‌గా అనిపించింది. రెగ్యుల‌ర్ హీరోలా కాకుండా ఓ క్యారెక్టర్‌ను ఎష్టాబ్లిష్ చేసుకునే ప్రయ‌త్నం నాకు బాగా న‌చ్చింది. ఈ సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను`` అన్నారు. 

హీరో ఉద‌య్ శంక‌ర్ మాట్లాడుతూ - ``ప‌వ‌న్ క‌ల్యాణ్‌గారు ఇంత బిజీ షెడ్యూల్‌లో కూడా మాకు స‌మ‌యాన్ని కేటాయించినందుకు ఆయ‌న‌కు థాంక్స్‌. ఆయ‌న‌కు నేను డై హార్డ్ ఫ్యాన్‌ని. నా డెబ్యూ మూవీలో ఆయ‌న సాంగ్‌ను రిలీజ్ చేయ‌డం ఆనందంగా ఉంది. జూలై 20న సినిమా విడుద‌ల కానుంది. చంద్ర సిద్ధార్థ‌గారు మంచి ఎమోష‌న‌ల్ ట‌చ్‌తో ఫీల్‌గుడ్ మూవీలా తెర‌కెక్కించారు. `ప‌వ‌ర్‌`, `లింగా`, `బ‌జ‌రంగీ భాయీజాన్‌` వంటి భారీ చిత్రాల నిర్మాత రాక్‌లైన్ వెంక‌టేశ్ గారి నిర్మాణంలో ఈ సినిమా వ‌స్తోంది. వాసుకి వైభ‌వ్ సంగీతం బావుంటుంది. చైత‌న్య ప్రసాద్‌గారు అన్ని పాట‌ల‌కు మంచి సాహిత్యాన్ని అందించారు. క‌న్న‌డ‌లో దొడ్డ‌న్న అనే పెద్ద న‌టుడు ఈ సినిమాలో నాతో యాక్ట్ చేశారు. అలాగే హైప‌ర్ ఆది, చ‌మ్మ‌క్ చంద్ర అంద‌రూ న‌టించారు. క‌ల్ట్‌, ర‌గ్డ్‌, ఎమోష‌న‌ల్, ఫీల్ గుడ్ మూవీ ఇది. ప్రేక్ష‌కుల‌కు మంచి సినిమా చూశామ‌నే ఫీలింగ్ ఉంటుంది`` అన్నారు. 

చైత‌న్య ప్రసాద్ మాట్లాడుతూ - ``చంద్ర సిద్ధార్థగారి ద‌ర్శక‌త్వంలో ఉద‌య్ శంక‌ర్ హీరోగా రాక్‌లైన్ వెంక‌టేశ్ ఆట‌గ‌దరా శివ సినిమాను నిర్మించారు. ఇందులో ఎట్టాగ‌య్యా శివ శివ పాట‌ను ప‌వ‌న్‌క‌ల్యాణ్ గారు విడుద‌ల చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. ఫిలాసిఫిక‌ల్ ట‌చ్ ఉండే పాట‌లు. ఉరి శిక్ష‌ను త‌ప్పించుకున్న ఖైదీ.. ఉరి తీయ‌డానికి వ‌స్తోన్న వ్యక్తి జీపునే ఎక్కుతాడు. వారిద్దరి ప్రయాణ‌మే ఈ సినిమా`` అన్నారు.