cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Press Releases

15 నిమషాల నెరేషన్ తో ఓకే అన్నా

15 నిమషాల నెరేషన్ తో ఓకే అన్నా

పదిహేను నిమషాల నెరేషన్ వినగానే ఈ సినిమా చేస్తానని దర్శకుడు మారుతికి చెప్పానని, వారం రోజుల తరువాత ఫుల్ నెరేషన్ ఇచ్చారని, అది వినేలోగానే మెంటల్ గా ఈ సినిమా చేస్తున్నా అని ఫిక్స్ అయిపోయానని, ఈ సినిమా సబ్జెక్ట్ అంత నచ్చిందని హీరో సాయి ధరమ్ తేజ్ అన్నారు. 

సాయి తేజ్ హీరోగా... మారుతి దర్శకుడిగా అల్లు అరవింద్, బన్నీ వాస్, వంశీ కలిపి సంయుక్తంగా నిర్మిస్తున్నా సినిమా ప్రతి రోజూ పండగే. ఈ సినిమా పాట విడుదల సందర్భంగా టీమ్ మొత్తం మీడియాతో మాట్లాడరు.  

హీరో సాయి తేజ్ మాట్లాడుతూ... "మీడియా నుంచి మంచి సపోర్ట్ వస్తోంది. చాలా థాంక్స్.  ఓ బావా పాటను యశ్ మాస్టర్  సహకారంతో హాఫ్ డే లో షూట్ చేశారు. తమన్ మంచి ట్యూన్ ఇచ్చారు. అయిదు మంచి పాటలు వున్నాయి మూవీలో. కరెంట్ ట్రెండ్ లో ఉండే టిక్ టాక్ సెలెబ్రిటీగా రాశిని చూపించారు. బెల్లం శ్రీదేవి తర్వాత ఏంజిలా అనే క్యారెక్టర్ బాగా గుర్తుండిపోతుంది. ఈ సినిమాలో నాకు ఎటువంటి డిసీజెస్, మతిమరుపులాంటివి లేవు. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉంటుంది.. డిసెంబర్ 20న వస్తున్న ఈ సినిమాను తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు".  అని అన్నారు.

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.... "ఏదన్నా మంచి సినిమా చేయాలనే ఆలోచనలోంచి వచ్చిన సినిమా ఇది.  రకరకాల కథలు అనుకొని ఫ్యామిలీ సబ్జెక్ట్ గా ప్రతీరోజు పండగేను తీసుకున్నాను. సోషల్ మీడియాలో ఈ సినిమా పోస్టర్ పెట్టగానే. రకరకాలుగా కథను ఊహించుకుంటున్నారు.

తాత మనవడు కథ అనుకుంటున్నారు. ఇద్దరినీ కలిపే కథ అనీ, ఫ్యామిలీని కలిపే కథ అని అనుకుంటున్నారు. అలాంటి కథ కాదు ఇది. ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి పాయింట్ ఇంతవరకు రాలేదు. పుట్టినప్పుడు సరదా పడతాం..సంబరాలు చేసుకుంటాం. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు కూడా సంతోషంతో బెస్ట్ సెండాఫ్ ఇవ్వాలనేది ఇన్ డైరెక్ట్ గా చెబుతున్నాం.

కొడుకు ఎదిగిన తర్వాత తండ్రిని మర్చిపోతున్నాడు. తండ్రికి ఎంత వాల్యూ ఇవ్వాలి అనేది ఎంటర్ టైన్ చేస్తూ హార్డ్ టచింగ్ గా చెప్పాం. సత్య రాజ్ గారు చేసిన యాక్టింగ్ కి మాకే కళ్లలో నీళ్లొచ్చాయి," అని అన్నారు. 

"భలే భలే మగాడివోయ్స్ స్క్రిప్ట్ చిరంజీవి గారికి చెప్పాను. మళ్లీ ఇప్పుడు ప్రతీ రోజు పండగే కథ మూడు గంటలు విన్నారు. ఆయన ఇచ్చిన ఎనర్జీతో షూటింగ్ కూడా ఫినిష్ చేసుకున్నాం. ఇంతమంది ఆర్టిస్టులతో వర్క్ చేయడం ఇదే ఫస్ట్ టైం. అన్ని వర్గాల్ని మెప్పించే చిత్రం అవుతుంది. సీతారామ శాస్త్రి గారు రాసిన పాట ప్రతీ ఒక్కరినీ కదిలిస్తుంది". అని అన్నారు.

నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ...  "ఈ సినిమాకు నేను నమ్మింది మారుతి ని మాత్రమే. కథ ఒక్కసారి మాత్రమే విన్నాను. మారుతి టైమింగ్ మీద నాకు నమ్మకం ఉంది. ఆ టైమింగ్ ను తేజు బాగా పండించగలడు. మారుతిని నమ్మి చేసిన సినిమా ఇది. భలే భలే మగాడివోయ్ చెప్పిన దానికంటే ఎక్కువే ఇచ్చాడు.

రాశి గారి సినిమాలు ఇంతముందు చూశాను కానీ... ఇంత బబ్లీగా ఇంత బాగా చేస్తుందని అనుకోలేదు. తేజుతో పిల్లా నువ్వు లేని జీవితం చేసాను. ఇప్పుడు ఈ సినిమాతో మా రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుందనుకుంటున్నాను". అని అన్నారు.  

హీరోయిన్ రాశి ఖన్నా మాట్లాడుతూ.... "నాకు చాలా చాలా ఇష్టమైన క్యారెక్టర్ ఇది. ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డాను. నేను టిక్ టాక్ లో లేను. ఈ సినిమా కోసం ఫస్ట్ టైం టిక్ టాక్ వీడియోస్ చూశాను.  మారుతి గారు నేను చేయగలనని నమ్మారు. నాకోసం చాలా మంచి పాత్ర రాశారు.  డిసెంబర్ 20న రిలీజ్ అవుతుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు". అని అన్నారు.