cloudfront

Advertisement


Home > Movies - Press Releases

ప్రేమకథ పాట విడుదల చేసిన మణిరత్నం

ప్రేమకథ పాట విడుదల చేసిన మణిరత్నం

విరాజ్.జె .అశ్విన్ ను హీరోగా  పరిచయం చేస్తూ 'అనగనగా ఓ ప్రేమకథ' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి విదితమే. టి.ప్రతాప్  దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత  కె.ఎల్.యన్.రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన 'లవ్ అంటే నేనేలే'  సాంగ్ ను సుప్రసిద్ధ  దర్శకుడు మణిరత్నం విడుదల చేశారు.

తమ చిత్రంలోని  పాటను జీనియస్ దర్శకుడు మణిరత్నం విడుదల చేయటం పట్ల చిత్ర నిర్మాత సంతోషాన్ని వ్యక్తం చేసి కృతఙ్ఞతలు తెలిపారు. ఈ గీతాన్ని మలేషియాలోని పలు సుందరమైన లొకేషన్ లలో చిత్రీకరణ జరుపుకుంది.

ఈ గీతాన్ని శ్రీమణి రచించగా, దేవన్ ఆలపించారు. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. అక్టోబర్ నెలలో విడుదల చేయటానికి సిద్ధం చేస్తున్నాము అని నిర్మాత తెలిపారు.