cloudfront

Advertisement


Home > Movies - Press Releases

పూరి చేతుల మీదగా పాట విడుదల

పూరి చేతుల మీదగా పాట విడుదల

విరాజ్.జె.అశ్విన్ హీరోగా పరిచయం అవుతూ అనగనగా ఓ ప్రేమకథ'' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి విదితమే. కె.సతీష్ కుమార్ సమర్పణలో టి.ప్రతాప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాయికలుగా రిద్ధి కుమార్, రాధా బంగారు నటిస్తున్నారు. సినిమా రంగంలో ప్రముఖ ఫైనాన్షియర్ గా పేరుపొందిన నిర్మాత కె.ఎల్.యన్.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సాంగ్ "నిన్ను విడవనులే" డాషింగ్  డైరెక్టర్" పూరి జగన్నాధ్" విడుదల చేసారు. డైరెక్టర్ పూరి జగన్నాధ్ మాట్లాడుతూ" ప్రొడ్యూసర్ కె.ఎల్.యన్.రాజు గారితో" అమ్మ నాన్న తమిళ్ అమ్మాయి"కి పనిచేశాను మళ్ళీ అయనతో సినిమా చేయాలనుకున్న కానీ రాజుగారు ఇతర బిజినెస్ లలో బిజీ అయిపోయారు.

మళ్ళీ చాలారోజులు తరవాత 'అనగనగా ఓ ప్రేమకథ' అనే సినిమాని నిర్మించారు నాకు చాల ఆనందంగా ఉంది... మార్తండ్ కే వెంకటేష్ గారి మేనల్లుడు అయిన విరాజ్ అశ్విన్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు, మార్తండ్ కే వెంకటేష్ గారితో నేను చాల సినిమాలు పనిచేశాను, తప్పకుండా విరాజ్ అశ్విన్ మంచి హీరో అవుతాడు అని నమ్మకం ఉంది. డైరెక్టర్ ప్రతాప్ కి బెస్ట్ విషెస్ చెపుతూ, ఈ సినిమాని హిట్ ఇవ్వాలి అని కోరుకుంటున్న" అని మాట్లాడారు.

తమ చిత్రం తొలి పాటను ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్  విడుదల చేయటం పట్ల చిత్ర నిర్మాత సంతోషాన్ని వ్యక్తంచేసి కృతఙ్ఞతలు తెలిపారు. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. అక్టోబర్ నెలలో విడుదల చేయటానికి సిద్ధం చేస్తున్నాము అని తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో కాశీవిశ్వనాధ్, అనీష్ కురువిళ్ళ, వేణు తదితరులు నటిస్తున్నారు.