cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Press Releases

రాగల 24 గంటల్లో బ్లాక్ బస్టర్ - దేవిశ్రీ ప్రసాద్

రాగల 24 గంటల్లో బ్లాక్ బస్టర్ - దేవిశ్రీ ప్రసాద్

సత్యదేవ్, ఈషా రెబ్బ, శ్రీరాం, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రదారులుగా నటించిన చిత్రం "రాగల 24 గంటల్లో". శ్రీ నవహాస్ క్రియేషన్స్, శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ బానర్స్ పై ఢమరుకం ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో నవ నిర్మాత శ్రీనివాస్ కానూరు ఈ చిత్రాన్ని నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం  నవంబరులో విడుదలకు రెడీ అవుతోంది. 

కాగా ఈ చిత్రం ప్రమోషనల్ సాంగ్ ని రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢమరుకం సినిమానుండి శ్రీనివాస్ రెడ్డి గారితో మంచి బాండింగ్ ఏర్పడింది. అప్పటినుంచి ఆయన మా ఫ్యామిలీ లో ఒక మెంబర్ అయిపోయారు. మంచితనానికి మారుపేరు ఆయన. ఈ ప్రమోషనల్ సాంగ్ నేను రిలీజ్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. టీజర్, ట్రయిలర్ చూశాను.. చాలా చాలా బాగున్నాయి. 

ఒక సినిమాని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత అందరిది. దానివల్ల నిర్మాతకు చాలా హెల్ప్ అవుతుంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ ఎంతో ఎఫర్ట్స్ పెట్టి సినిమా చేశారు. ప్రతి ఒక్కరు చాలా కాన్ఫిడెంట్ గా వున్నారు. ముఖ్యంగా నిర్మాత శ్రీనివాస్ కానూరు గారు మంచి ఫ్యాషన్ ఉన్న నిర్మాత. డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఈ సినిమా పెద్ద బ్రేక్ అవుతుంది.  ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.. అవ్వాలని కోరుకుంటున్నాను.. అన్నారు.

దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రమోషనల్ సాంగ్ చేయడానికి ఇన్స్పిరేషన్ దేవిశ్రీప్రసాద్. అడగ్గానే దేవి వచ్చి మా సాంగ్ లాంచ్ చేసినందుకు థాంక్స్. రఘు కుంచె చాలా ట్రెండీగా ఈ పాటని కంపోజ్ చేశారు. కృష్ణభగవాన్ స్క్రిప్ట్ నచ్చి మనసు పెట్టి మంచి డైలాగ్స్ రాశారు. అందరూ గర్వపడే విధంగా సినిమా చేశాను. కెమెరా, మ్యూజిక్ ఈ సినిమాకి రెండు కళ్ళు. అంజి బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చాడు. రఘు అద్భుతమైన పాటలు, రీ-రికార్డింగ్ చేశాడు.  ఈ చిత్రాన్ని ఆదరించి సక్సెస్ చెయ్యాలని కోరుకుంటున్నాను.. అన్నారు.

నిర్మాత శ్రీనివాస్ కానూరు మాట్లాడుతూ.. బేసిగా మాది ట్రావెల్ బిజినెస్. నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. అన్ని సినిమాలు చూస్తాను. శ్రీనివాస్ రెడ్డి మంచి స్నేహితుడు. నా మొదటి సినిమా శ్రీనివాస్ రెడ్డి లాంటి మంచి డైరెక్టర్ తో నిర్మించడం నా అదృష్టం.  సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. చిన్నపిల్లలు నుండి పెద్దవారి వరకు అందరికీ నచ్చే విధంగా ఈ చిత్రం ఉంటుంది.  నవంబర్ మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాము.. అన్నారు.

నేను డైరెక్టర్.. తమ్ముళ్లు ఒకడు హీరో.. మరోడు ప్రొడ్యూసర్