Advertisement


Home > Movies - Press Releases
రేడియో మిర్చిలో 'వైశాఖం' సందడి

ఆర్‌.జె.సినిమాస్‌ పతాకంపై జయ దర్శకత్వంలో బి.ఎ.రాజు నిర్మిస్తున్న లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'వైశాఖం'. హరీష్‌, అవంతిక జంటగా నటించిన ఈ చిత్రానికి డి.జె.వసంత్‌ సంగీతాన్నందించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. ఈ నేపథ్యంలో హీరో హరీష్‌, సంగీత దర్శకుడు డి.జె.వసంత్‌ హైదరాబాద్‌లోని రేడియో మిర్చిలో ఓ స్పెషల్‌ ప్రోగ్రామ్‌ చేశారు. 

ఈ సందర్భంగా హీరో హరీష్‌ మాట్లాడుతూ - ''ఆడియో చాలా పెద్ద హిట్‌ అయింది. చిత్రంలోని అన్ని పాటలూ ఒక దాన్ని మించి మరొకటి అన్నట్టుగా వున్నాయి. వసంత్‌గారు చాలా మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. ఈ చిత్రంలోని పాటల్ని అందరూ విని ఎంజాయ్‌ చేస్తున్నారు'' అన్నారు

ఈ సందర్భంగా సంగీత దర్శకుడు డి.జె.వసంత్‌ మాట్లాడుతూ - ''ఈ చిత్రంలోని ఐదు పాటలూ చాలా పెద్ద హిట్‌ అయ్యాయి. ఆడియో చాలా ఎక్స్‌లెంట్‌గా వుందని అన్ని ఏరియాల నుంచి రిపోర్ట్స్‌ వస్తున్నాయి. నా కెరీర్‌లో 'వైశాఖం' ఒక స్పెషల్‌ మూవీ అని చెప్పొచ్చు. 
హరీష్‌, అవంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.