cloudfront

Advertisement


Home > Movies - Press Releases

రోజా సమర్పిస్తున్న 'శ్రీపూర్ణిమ'

రోజా సమర్పిస్తున్న 'శ్రీపూర్ణిమ'

భక్తి ప్రపత్తులు కలవారికి వివిధ ధార్మిక విషయాలు, స్తోత్రాలు కలగలిగిపి సంకలనం చేసి అందిస్తున్న పుస్తకం శ్రీ పూర్ణిమ. ఈ పుస్తకాన్ని నగరి ఎమ్మెల్యే, నటి, ఏపిఐడిసి చైర్ పర్సన్ రోజా అందిస్తున్నారు. మారు 800 పేజీలతో పరమాత్మ లాలిత్యాన్ని అనేక స్తోత్రాలతో, అనేక లలిత లలిత పదబంధురాల వ్యాఖ్యానాలతో తయారు చేసారు ఈ శ్రీపూర్ణిమ గ్రంధాన్ని.

భార‌త వైదిక వాజ్మ‌యంలో ఉండే ప్రధాన అంశాల‌న్నింటినీ ఈ `శ్రీపూర్ణిమ‌`లో ఓ అద్భుత సార‌స్వత దృష్టితో భ‌క్తుల‌కు ఎంతో స‌న్నిహితంగా ఉండేలా సంకలన కర్త పి. శ్రీనివాస్ ఈ పుస్తకాన్ని తయారుచేసారు. రోజూ రెండు పూటలా నిత్యపారయణ గ్రంధంగా దీన్ని చదువుకునేందుకు వీలుగా అనేక స్తోత్రాలు, కీర్తనలు ఇందులో పొందు పరిచారు. 

ఈ పుస్తకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరింపచేయడానికి ఎమ్మెల్యే రోజా ఏర్పాట్లుచేస్తున్నారు.