Advertisement


Home > Movies - Press Releases
సాక్ష్యం సూపర్ హిట్ కావాలి-వినాయక్

అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీవాస్ దర్శకత్వంలో యంగ్ డైనమిక్ ప్రొడ్యూసర్ అభిషేక్ నామా భారీ బడ్జెట్ తో  నిర్మించిన "సాక్ష్యం"  .ఈ చిత్రాన్ని జులై 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.ఈ సందర్బంగా ప్రసాద్ ల్యాబ్ లో ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సెన్షేషనల్ డైరెక్టర్ వి వి వినాయక్, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, హీరోయిన్ పూజ హెగ్డే ,నిర్మాత అభిషేక్ నామా పాల్గొన్నారు. సాక్షం చిత్రంలోని హీరో ఇంట్రడక్షన్ సాంగ్ "డెస్టిని" పాటని వినాయక్ రిలీజ్ చేశారు.అనంతరం పాటల్ని,,ట్రైలర్స్ ని స్క్రీన్ పై ప్రదర్శించారు. 

ఈ సందర్భంగా  డైరెక్టర్  వి.వి.వినాయక్ మాట్లాడుతూ "- అల్లుడుశీను రిలీజ్ అయి అప్పుడే నాలుగు ఏళ్ళు అయిందంటే నమ్మలేకుండా వున్నాను.నిన్ననే షూటింగ్ చేసినట్లుంది. సాయి సినిమా సినిమాకి చాలా మెచ్యూర్డ్ గా ఎదుగుతున్నాడు. అతను ఇంకా మంచి సినిమాలు చేసి పెద్ద  హీరో అవ్వాలని కోరుకుంటున్నాను.

పూజ హెగ్దే ఈ సినిమాకి  ఆకర్షణ. సాక్ష్యం ట్రైలర్ చాలా బాగుంది.అభిషేక్ చాలా ప్రెస్టీజియస్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు. విజువల్స్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

హీరోయిన్ పూజా హేగ్దే మాట్లాడుతూ"- జులై 27న సాక్ష్యం రిలీజ్ అవుతుంది.చాలా నెర్వస్ గా,ఎక్సయిటింగ్ గా ఉంది.సినిమా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది.ఈ చిత్రం లో న్యూ క్యారెక్టర్ చేసాను. విజువల్స్ అన్నీ స్టన్నింగ్ గా ఉంటాయి. ఆర్టిస్ట్స్, టెక్ నీషియన్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు.డెఫినెట్ గా ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది అన్నారు.

చిత్ర నిర్మాత అభిషేక్ నామా  మాట్లాడుతూ "- మా సినిమా సాక్ష్యం జులై 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది.ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించి పెద్ద హిట్ చెయ్యాలని కోరుకుంటున్నాను. అన్నారు.

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ "-  మా టీమ్  అందరం కలిసి ఒక మంచి సినిమా చేసాం.ఇలాంటి చిత్రాలను ఆదరిస్తేనే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి. అల్లుడు శీను సినిమా వచ్చి ఫోర్ ఇయర్స్ అయింది.ఇది నా నాలుగవ సినిమా. నన్ను హీరోగా లాంచ్ చేసిన వినాయక్ గారు వచ్చి ఇప్పుడు సాక్ష్యం లో నా ఇంట్రడక్షన్ సాంగ్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది.ఆయనికి నా థాంక్స్ తెలుపుకుంటున్నాను. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించి సపోర్ట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.