cloudfront

Advertisement


Home > Movies - Press Releases

సమాజం 'ఆయుష్మాన్ భవ'

సమాజం 'ఆయుష్మాన్ భవ'

స‌మాజం ప్రేమ‌ని చూసే ప‌ద్ద‌లి మారాలి అనే క‌మ‌ర్షియ‌ల్ పాయింట్ లో తెరకెక్కుతున్న చిత్రం ఆయుష్మాన్ భవ. చ‌ర‌ణ్ తేజ్ హీరోగా త‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నేనేలోక‌ల్ చిత్ర ద‌ర్శ‌కుడు నక్కిన త్రినాధ రావు స్టోరి, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న చిత్రం ఇది.   ప్ర‌ముఖ ర‌చ‌యిత‌లు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ క‌థ‌నం తో రూపోందుతున్న ఈ చిత్రానికి బాలీవుడ్ లో బేబిడాళ్‌, హంగ్ ఓవ‌ర్‌, హైహీల్స్ లాంటి సూప‌ర్బ్ సాంగ్స్ కంపోజ్ చేసిన మీట్ బ్రోస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం లో ప్ర‌ముఖ

హీరో్యిన్ స్నేహ ఉల్లాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మెద‌టి లుక్ ని ఈరోజు విడుద‌ల చేసారు..
ఈ సంద‌ర్భంగా చ‌ర‌ణ్ తేజ్ మాట్లాడుతూ..  ముందుగా ఈ చిత్రానికి ఇంత మంచి క‌థ ని అందించట‌మే కాకుండా ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తున్న సూప‌ర్‌స‌క్స్‌స్‌ఫుల్ ద‌ర్శ‌కుడు త్రినాథ్ రావు న‌క్కిన గారికి, స్క్రీన్‌ప్లే అందించిన ప్ర‌ముఖ ర‌చ‌యిత‌లు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ కి నా హ్రుద‌య‌పూర్వ‌క ద‌న్య‌వాదాలు. అలాగే క్రేజి ద‌ర్శ‌కుడు మారుతి గారి మా చిత్రానికి స‌హ‌నిర్మాత‌గా భాద్య‌త‌లు స్వీక‌రించినందుకు వారికి నా ద‌న్య‌వాదాలు.  మేము అడిగిన వెంట‌నే మా క‌థ న‌చ్చి మా చిత్రం లో హీరోయిన్ గా చేస్తున్న స్నేహ ఉల్లాల్ థ్యాంక్స్‌, స్నేహ ఉల్లాల్ పాత్ర చాలా బాగా డిజైన్ చేశాము. మాకు ఆడియో బాలీవుడ్ సూప‌ర్ మ్యూజిక్ ద‌ర్శ‌కుడు మీట్ బ్రోస్ చేస్తున్నారు. 

మ‌న తెలుగు రాష్ట్ర‌ల్లో మీట్ బ్రోస్ అందించిన ఆడియో నే యూత్ విప‌రీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్ప‌డు డైర‌క్ట్ గా వాళ్ళు మా చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి కులం, మ‌తం వేరైతే.. మ‌ర్చిపోవాలా.. పారిపోవాలా.. చ‌చ్చిపోవాలా.. ప్ర‌పంచం ఏమైతే నాకేంటి స‌మాజం ప్రేమ‌ని చూసే విధానం మారాలి లేక‌పోతే చంపేస్తా .. అనుకునే హీరో క్యార‌క్ట‌రైజేష‌న్ తో ఈ చిత్రం తెర‌కెక్కింది. ఈ రోజు మెద‌టి లుక్ ని విడుద‌ల చేశాము.. షూటింగ్ పూర్తిచేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఈ స‌మ్మ‌ర్ లోనే చిత్రాన్ని విడుద‌ల చేస్తాము. ఈ చిత్రం త‌ప్ప‌కుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంద‌ని న‌మ్ముతున్నాము.. అని అన్నారు..