Advertisement


Home > Movies - Press Releases
సప్తగిరి కామెడీ టైమింగ్ ఇష్టం

సప్తగిరి హీరోగా నటిస్తున్నరెండో సినిమా సప్తగిరి ఎల్ ఎల్ బి. సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై.లి. పతాకంపై డా. రవికిరణ్‌  హిందీలో  హిట్‌గా నిలిచిన 'జాలీ ఎల్‌.ఎల్‌.బి' చిత్రం ఆధారంగా నిర్మించారు.  చరణ్‌ లక్కాకుల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.  ఈ చిత్రంలోని మూడవ పాటని  నేచురల్‌ స్టార్‌ నాని విడుదల చేశారు. 

ఈ సందర్భంగా  నాని మాట్లాడుతూ - ''సప్తగిరి ఎల్‌.పల్‌.బి' చిత్రంలోని మూడవ పాటని లాంచ్‌ చేయడం చాలా ఆనందంగా వుంది. సప్తగిరి అంటే నాకు చాలా ఇష్టం. ఇద్దరం 'మజ్ను' చిత్రంలో కలిసి నటించాం. అతని కామెడీ ట్రాక్‌ టైమింగ్‌ అంటే నాకు చాలా ఇష్టం. 'ప్రేమకథా చిత్రమ్‌' చూసి చాలా ఎంజాయ్‌ చేశాను. ఈ చిత్రం కూడా సూపర్‌హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. ఈ టీమ్‌ అందరికీ పెద్ద సక్సెస్‌ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అన్నారు. 

హీరో సప్తగిరి మాట్లాడుతూ - ''సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి' చిత్రంలోని రెండు పాటలు ఆల్‌రెడీ రిలీజ్‌ అయ్యాయి. మూడవ పాటని మంచి మనసున్న హీరో మా నానిగారు రిలీజ్‌ చేయడం చాలా హ్యాపీగా వుంది. టీజర్‌కి బ్రహ్మాండమైన రెస్పాన్స్‌ వస్తోంది. త్వరలో థియేట్రికల్‌ ట్రైలర్‌ని కూడా లాంచ్‌ చేస్తాం. నానిగారు వరుస విజయాలు సాధిస్తున్నారు. ఆయన పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ మాకు కావాలి. నానిగారు మరిన్ని మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను'' అన్నారు. 

దర్శకుడు చరణ్‌ లక్కాకుల మాట్లాడుతూ - '''నానిగారి 'భీమిలి కబడ్జీ జట్టు'కి వర్క్‌ చేశాను. అప్పట్నుంచీ ఆయనతో ట్రావెల్‌ అవుతున్నాను. ఎప్పుడు కలిసినా చాలా ఫ్రీగా మాట్లాడతారు. ఏం చేస్తున్నావ్‌? త్వరగా మంచి సినిమా చెయ్యి అని చెప్పేవారు. అలాంటి నానిగారు మా థర్డ్‌ సాంగ్‌ని లాంచ్‌ చేయడం చాలా హ్యాపీగా వుంది'' అన్నారు. 

నిర్మాత డా. రవికిరణ్‌ మాట్లాడుతూ - ''అష్టాచెమ్మా' నుండి నానిగారికి ఫ్యాన్‌ని. తన నేచురల్‌ పెర్‌ఫార్మెన్స్‌తో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన ఇంకా మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. 'సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి'లోని మూడవ పాటని నాని లాంచ్‌ చేయడం చాలా హ్యాపీగా వుంది. ఇది మా సినిమాకి ఎంతో ప్లస్‌ అవుతుంది. సినిమా అంతా కంప్లీట్‌ అయ్యింది. త్వరలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని గ్రాండ్‌గా జరిపి సినిమాని వరల్డ్‌వైడ్‌గా డిసెంబర్‌ 7న రిలీజ్‌ చేస్తాం'' అన్నారు.