cloudfront

Advertisement


Home > Movies - Press Releases

సెప్టెంబర్ 13న 'నన్ను దోచుకుందువటే'

సెప్టెంబర్ 13న 'నన్ను దోచుకుందువటే'

ఇప్పుడు టాలీవుడ్ లో రిలీజ్ డేట్ ల ప్రకటనలు జోరుగా వస్తున్నాయి. ఎవరికివారు డేట్ లు ప్రకటించేస్తున్నారు. ఆగస్టు ఆల్ మోస్ట్ ఫుల్. సెప్టెంబర్ కూడా ఫుల్ అయిపోతోంది. అక్టోబర్ కు డేట్ లు వచ్చేసాయి. ఇలాంటి నేపథ్యంలో మరో సినిమా డేట్ కూడా వచ్చేసింది.

ఇటీవలే సమ్మోహనం సినిమాతో డీసెంట్ హిట్ కొట్టిన హీరో సుధీర్ బాబు నిర్మాతగా మారి నిర్మించిన 'నన్ను దోచుకుందువటే' సినిమా డేట్ కూడా ప్రకటించారు. నభా నటేశ్ ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఆర్‌.ఎస్ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువ‌టే.. ఈ చిత్రం మెద‌టి లుక్ టీజ‌ర్ ని 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అలాగే ఈ చిత్రాన్ని అన్నికార్యక్రమాలు పూర్తిచేసి వినాయ‌చ‌వితి రోజైన సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల చేయాటానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు.

ఈసందర్భంగా దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు మాట్లాడుతూ 'నన్నుదోచుకుందువ‌టే' టీజ‌ర్ ని జులై 14న రిలీజ్ చేస్తున్నాము.  అలాగే ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 14న విడుదల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నాము. ఈ చిత్రం ప్రోడ‌క్షన్ విలువ‌లు ఎక్కడా త‌గ్గకూడ‌దు అనే సంకల్పంతోనే సుధీర్‌బాబు  ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేశారు. ఈ క‌థ చాలా ఫ్రెష్ గా వుంది. కొత్త హీరోయిన్ అయినప్పటికీ నభా నటేశ్ చాలా బాగా చేసింది. అజనీష్ సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది.  అని అన్నారు.