cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Press Releases

సెప్టెంబర్ 13న 'మార్షల్'

సెప్టెంబర్ 13న 'మార్షల్'

అభయ్, మేఘా చౌదరి జంటగా నటించిన చిత్రం ‘మార్షల్’. హీరో శ్రీకాంత్ ఓ ముఖ్యమైన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని హీరో అభయ్ తన సొంత బ్యానర్ లోనే నిర్మించారు. ఈ చిత్రానికి జై రాజాసింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబరు 13 న విడుదలవుతోంది. 'డిజైనర్ బేబీస్ కాన్సెప్ట్ అనే యూనీక్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా ఇది.

అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే సబ్జెక్టు ఇది. ప్రస్తుత సమాజంలో చాలా మంది వృత్తి రీత్యా... ఒత్తిడి వల్ల సంతానానికి సమయం ఇవ్వలేక... సరోగసి పద్దతిని ఎంచుకుంటున్నారు. ఈ బ్యాక్ డ్రాప్ లో తయారైన కథతో మార్షల్ సినిమాను రూపొందించారు.

"కె జి ఎఫ్" మ్యూజిక్ ఫేమ్ రవి బసురి తెలుగు సినిమా మార్షల్ ని రష్ చూసి ప్రత్యేకంగా నచ్చి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ సినిమాలో రీ రికార్డింగ్ తో పాటు రెండు పాటలకు ట్యూన్ లు సమకూర్చారు. ఈ సినిమా చూసినచ్చి ఫస్టు కాపీని ఫాన్సీ ఆఫర్ రేట్ ఇచ్చికొన్నారు ఆర్ ఎక్స్ 100 సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసిన శివమ్ షేల్యూలైడ్స్ సురేష్ రెడ్డి. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 300 థియేటర్లకు పైగా రిలీజ్ చేస్తున్నారు.

నిర్మాత మరియు హీరో అభయ్ అడకా సినిమా విడుదల సందర్భంగా మాట్లాడుతూ తనపాత్ర ఎంతో హుందాగా, నూతనంగా ఉంటుందని వివరించారు. సినీ హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో ఒక మరచిపోలేని పాత్రకు ప్రాణం పోశారని చెప్పారు.