Advertisement


Home > Movies - Press Releases
శివ నిర్వాణతో నాని కొత్త సినిమా

నాని హీరోగా నిర్మాత దానయ్య కొత్త దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్ లో  డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి పతాకంపై నిర్మిస్తున్న ప్రొడక్షన్‌ నెం.3 షూటింగ్‌  ఫిలింనగర్‌ దైవ సన్నిధానంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రారంభమైంది. నాని, నివేథా థామస్‌, ఆది పినిశెట్టిలపై తీసిన ముహూర్తపు షాట్‌కి సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ క్లాప్‌ కొట్టగా, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు.ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌, దామోదర ప్రసాద్‌, మైత్రి మూవీస్‌ యలమంచిలి రవిశంకర్‌, దర్శకుడు బి.వి.ఎస్‌.రవి, జెమిని కిరణ్‌, శివలెంక కృష్ణప్రసాద్‌, బెక్కం వేణుగోపాల్‌ తదితరులు ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. 

ఈ చిత్రం గురించి నాని మాట్లాడుతూ - ''వరసగా మంచి సినిమాలు చేసే అవకాశం వచ్చిన నాకు 'నేను లోకల్‌' తర్వాత ఎలాంటి సినిమా చెయ్యాలా అని ఆలోచిస్తున్న టైమ్‌లో శివ వచ్చి ఈ స్టోరీ చెరప్పగానే ఇలాంటి సినిమానే చెయ్యాలనిపించి ఇమ్మీడియేట్‌గా అంగీకరించాను. ఒక ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌తో ఎంటర్‌టైనింగ్‌గా సాగే ఈ సినిమా టీమ్‌ అంతా నాకు ఇష్టమైన టీమ్‌. శివ, కోన వెంకట్‌, కార్తీక్‌ ఘట్టమనేని, గోపీసుందర్‌, హీరోయిన్‌ నివేథా వీళ్ళందరితో కలిసి చెయ్యడం చాలా హ్యాపీగా వుంది. 

నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ - ''నానితో ఫస్ట్‌ టైమ్‌ మా బేనర్‌లో చేస్తున్నాం. ఈ చిత్రం 80 శాతం షూటింగ్‌ అమెరికాలో వుంటుంది. చాలా భారీ సినిమా. మిగిలిన షూటింగ్‌ హైదరాబాద్‌, వైజాగ్‌లలో జరుగుతుంది. శివ చెప్పిన కథ నచ్చి కథకు పూర్తి న్యాయం జరిగేలా భారీ ఎత్తున ఈ సినిమా చేస్తున్నాం. డిసెంబర్‌ 5 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి ఏకధాటిగా చేస్తాం'' అన్నారు. 

హీరోయిన్‌ నివేథా థామస్‌ మాట్లాడుతూ - ''జెంటిల్‌మన్‌ తర్వాత నానితో మళ్ళీ వర్క్‌ చెయ్యడం ఆనందంగా వుంది. ఈ సబ్జెక్ట్‌, ఈ టీమ్‌ అంతా వండర్‌ఫుల్‌. ఎప్పుడెప్పుడు షూటింగ్‌ చేస్తానా అని చాలా ఎక్సైటింగ్‌గా వున్నాను'' అన్నారు. 

దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ - ''ఒక సెన్సిబుల్‌ పాయింట్‌ని ఎంటర్‌టైనింగ్‌ వేలో చెప్పే ప్రయత్నం ఇది. నానికి కథ చెప్పగానే వెంటనే ఓకే అన్నారు. కోన వెంకట్‌గారి స్క్రీన్‌ప్లే ఈ కథకు ఇంకా గ్రిప్‌ తెచ్చింది. దానయ్యగారిలాంటి పెద్ద ప్రొడ్యూసర్‌ బేనర్‌లో ఇంత మంచి టీమ్‌తో నా తొలి చిత్రం చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను'' అన్నారు. 

రచయిత కోన వెంకట్‌ మాట్లాడుతూ - ''నాని, ఆది ఫస్ట్‌ కాంబినేషన్‌, నాని, నివేథా హిట్‌ కాంబినేషన్‌, డైరెక్టర్‌ శివ మంచి టాలెంట్‌, సబ్జెక్ట్‌ చాలా బాగుంటుంది. నాని వరస విజయాల్లో ఇది మరో హిట్‌ మూవీ అవుతుంది. దానయ్య డి.వి.వి. కాంప్రమైజ్‌ అవకుండా ఈ చిత్రాన్ని లావిష్‌గా తీస్తున్నారు'' అన్నారు. 

ఈ చిత్రంలో  మురళీశర్మ, తనికెళ్ళ భరణి, పృథ్వీ, రాజశ్రీనాయర్‌, నీతు, భూపాల్‌రాజ్‌, కేదార్‌శంకర్‌, పద్మజ, ప్రియాంక నాయుడు, మాస్టర్‌ నేహంత్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్‌, సంగీతం: గోపీసుందర్‌, ఫోటోగ్రఫీ: కార్తీక్‌ ఘట్టమనేని, ఆర్ట్‌: చిన్నా, స్టైలింగ్‌: నీరజ కోన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీజో, కో-డైరెక్టర్‌: లక్ష్మణ్‌ ముసులూరి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సత్యం గుగ్గిల, నిర్మాత: దానయ్య డి.వి.వి., రచన, దర్శకత్వం: శివ నిర్వాణ.