cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Press Releases

సాఫ్ట్ వేర్ సుధీర్ వెబ్ సైట్ ప్రారంభం

సాఫ్ట్ వేర్ సుధీర్ వెబ్ సైట్ ప్రారంభం

సుడిగాలి సుధీర్ హీరోగా నిర్మిస్తున్న చిత్రం సాఫ్ట్ వేర్ సుధీర్. ఈ సినిమా ప్రమోషన్ కోసం ఉద్దేశించిన వెబ్ సైట్ ను రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.

సుడిగాలి సుధీర్, ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బేనర్‌పై  కె. శేఖర్‌ రాజు ఈ సినిమాను నిర్మి్స్తున్నారు.  ఈ సినిమా ద్వారా రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 

'సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌' వెబ్ సైట్ ను తెలంగాణ సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణమంత్రి మల్లారెడ్డి, చిత్ర నిర్మాత కె.శేఖర్‌ రాజు, దర్శకుడు రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల పాల్గొన్నారు.

ఈ చిత్రానికి సంబందించిన అన్ని వివరాలను ఆ వెబ్ సైట్ లో పొందుపరిచారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్ రెండవ వారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.