cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Press Releases

త్రివిక్రమ్ చేతుల మీదగా మిస్ మ్యాచ్ సాంగ్

త్రివిక్రమ్ చేతుల మీదగా మిస్ మ్యాచ్ సాంగ్

'అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' సంస్థ తమ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రం  'మిస్ మ్యాచ్'. ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. ఎన్ వి. నిర్మల్ కుమార్ దర్శకుడు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని 'యు' సర్టిఫికెట్ ను పొందిందీ చిత్రం. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 6 న 'మిస్ మ్యాచ్' ను  విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ లు  ఇటీవలే మీడియాకు ప్రకటించారు.

ఈ నేపథ్యంలో 'మిస్ మ్యాచ్' చిత్రంలోని మొదటిపాట 'అరెరే అరెరే' ను దర్శకుడు త్రివిక్రమ్ విడుదల చేసారు. ఈ సందర్బంగా డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ...'మిస్ మ్యాచ్' టైటిల్ కొత్తగానూ,ఆసక్తిని కలిగించేదిగానూ ఉంది.  తెలుగులో నిర్మల్ కుమార్ చేస్తున్న తొలి సినిమా 'మిస్ మ్యాచ్' సినిమా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు రిలీజ్ అయిన 'అరెరే అరెరే' మెలోడీ సాంగ్, వినాలనిపించేదిగా ఉంది" అన్నారు.

హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ...నా అభిమాన దర్శకుడు త్రివిక్రమ్ 'మిస్ మ్యాచ్' చిత్రంలోని ఫస్ట్ సాంగ్ ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం అందరికి నచ్చుతుందని భావిస్తున్న అన్నారు

నిర్మాత శ్రీరామ్ మాట్లాడుతూ...స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ సాంగ్ రిలీజ్ చెయ్యడం హ్యాపీ గా ఉంది. 'ఈ చిత్రానికి సంబంధించి ప్రముఖ దర్శకుడు 'క్రిష్' చేతుల మీదుగా  విడుదల అయిన 'మిస్ మ్యాచ్' తొలి ప్రచార చిత్రాలు, విక్టరీ వెంకటేష్ గారు విడుదల చేసిన చిత్రం టీజర్, అలాగే ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి విడుదల చేసిన చిత్రం థియేట్రికల్ ట్రైలర్ కు ప్రేక్షకులనుంచి విశేషమైన స్పందన లభించిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారికి మరోసారి కృతఙ్ఞతలు తెలిపారు.