cloudfront

Advertisement


Home > Movies - Press Releases

సుబ్రహ్మణ్యపురం అడియో ఫంక్షన్

సుబ్రహ్మణ్యపురం అడియో ఫంక్షన్

‘‘సుధాకర్ ఇంపెక్స్ ఐపిఎల్’’ పతాకం పై బీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన చిత్రం. ‘‘సుబ్రహ్మణ్యపురం’’. ఈ సినిమా  ఆడియో లాంచ్ యూనిట్ సభ్యుల మద్య సందండిగా జరిగింది. సుమంత్ , ఈషారెబ్బ జంటగా నటించిన ఈ మూవీ తో  సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.  ఈ అడియో కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా నిర్మాతలు రాజ్ కందుకూరి,  కాంగ్రెస్ నాయకుడు శివకాంత్ రావు తదితరులు హాజరయ్యారు. ఇతర పాత్రలలో నటించిన హర్షిణి, జోష్ రవి, భద్రం ఈ ఆడియో లాంచ్ లో పాల్గోన్నారు.

ఈ సందర్భంగా మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ  సుబ్రహ్మణ్యపురం ట్రయిలర్ కు మంచి స్పందన వచ్చింది.  సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నానని అన్నారు.

నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ ఇందులో పనిచేసిన టెక్నీషన్స్ అందరకీ  అందరికీ నా కృతజ్ఞతలు, దేవుడు ఉన్నాడా లేదా...? దేవుని శక్తి గొప్పదా..? మానవ మేథస్సు గొప్పదా..? అనేది ఈ నెల 7న తెలియబోతుంది. ఫైనాన్షియర్ గా కొనసాగుతున్న నేను కథ నచ్చి నిర్మాతగా మారాను.సినిమా తప్పకుండా మీకు కొత్త ఎక్స్ పీరియన్స్ లను అందిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు.

దర్శకుడు సంతోష్ మాట్లాడుతూ ‘‘ షార్ట్ ఫిల్మ్ మేకర్ గా ఉన్న నేను సుబ్రహ్మణ్యపురం వంటి  సినిమా తీసానంటే దానికి కారణం నిర్మాత సుధాకర్ రెడ్డిగారు. నేను కథ చెప్పగానే ఆయర నాకు ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను,  సుమంత్ కు  రెండున్నర గంటలు కథ చెప్పాను, అయిష్టంగా విన్నా వెంటనే నాకు ఓకే చెప్పారు.   ఈ సినిమా లోని సన్నివేశాలకు శేఖర్ చంద్ర ప్రాణం పోసాడు. ఈ సినిమా తర్వాత ఆయన మ్యూజిక్ ఒక మార్క్ ని సెట్ చేస్తుంది’’ అన్నారు.

రాజ్ కందుకూరి మాట్లాడుతూ ‘‘ ఈ సినిమా లో చాలా పాజిటివ్ పాయింట్స్ కనిపిస్తున్నాయి. సుబ్రహ్మణ్యపురం పేరులోనే చాలా పాజిటివ్ నెస్ ఉంది.  ఈ సబ్జెక్ట్ చేసిన దర్శకుడు సంతోష్ జాగర్లమూడి అలనాటి ప్రముఖుడు  మల్లాది చంద్రశేఖర్ రావు గారి మనవడు, ఈ సినిమా తో పెద్ద హిట్ కొట్టబోతున్నారని అనిపిస్తుంది అన్నారు.

హీరోయిన్ ఈషా రెబ్బ మాట్లాడుతూ సుధాకర్ గారు చాలా అభిరుచి గల నిర్మాత,  సంతోష్ చాలా టాలెంటెడ్ దర్శకుడు.  సుమంత్ గారితో వర్క్ చేయడం తో నేను చాలా నేర్చుకున్నాను.  డిసెంబర్ 7న రిలీజ్ అవుతుంది అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను’’ అన్నారు.

హీరో సుమంత్ మాట్లాడుతూ ‘‘ ఈ ప్రాజెక్ట్ నా దగ్గరకు తెచ్చిన సుజితాకు థ్యాంక్స్. థ్రిల్లర్స్ అంటే నాకు పెద్ద ఇష్టం ఉండవు. సంతోష్ వచ్చి కథ చెప్పినప్పుడు టోటల్ ఎంగేజ్ అయ్యాను. అప్పుడు చెప్పాను చెప్పిన కథకు 70 పర్సెంట్ చేస్తే హిట్ అనుకున్నాను.

కానీ సంతోష్ 90 పర్సెంట్ రీచ్ అయ్యాడు. తర్వాత నిర్మాత గురించి చెప్పాలి  ఇది మాములుగా చేసే సినిమా కాదు, విఫెక్స్  విషయంలో కూడా ఎక్కడా రాజీ పడలేదు. ప్రమోషన్స్ విషయంలో కూడా చాలా బాగా చేస్తున్నారు. సుధాకర్ గారికి స్పెషల్ థ్యాంక్స్’’ అన్నారు.