cloudfront

Advertisement


Home > Movies - Press Releases

సుబ్రహ్మణ్యపురం ఫ్యామిలీ మూవీ

సుబ్రహ్మణ్యపురం ఫ్యామిలీ మూవీ

సుమంత్‌, ఈషారెబ్బా హీరో హీరోయిన్‌గా న‌టించిన చిత్రం `సుబ్రహ్మణ్యపురం`. సంతోష్ జాగ‌ర్లపూడి ద‌ర్శకుడు. సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బీరం సుధాకర్‌రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం డిసెంబ‌ర్ 7న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత బీరం సుధాక‌ర రెడ్డి మాట్లాడుతూ ఈ సినిమా 'కార్తికేయ' సినిమాకు పూర్తి బిన్నంగా ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తప్ప ఈ సినిమాలో కామన్‌ పాయింట్‌ ఉండదు. కొత్త డైరెక్టర్‌ అయినా ఈ సినిమాను చాలా బాగా హ్యాండిల్‌ చేశాడు.

దైవాన్ని నమ్మని వాళ్ళు కూడా దైవం ఉంది అని నమ్మేవిధంగా ఈ సినిమాను దర్శకుడు సంతోష్‌ తెరకెక్కించడం జరిగింది. సినిమా మంచి డివోషనల్‌ థ్రిల్లర్‌ను సైంటిఫిక్‌ వేలో చూపించడం జరిగింది. పూర్వకాలం,సెకండ్‌ వరల్డ్‌ వార్‌ టైం నుండి దైవం యొక్క గొప్పతనం ఈ సినిమాలో చూపించడం జరిగింది. వాటితో పాటు ఆడియన్స్‌ కోరుకునే అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఈసినిమాలో ఉంటాయి. ఎలక్షన్ రోజు పోలింగ్‌ తరువాత వరుసగా మూడు రోజులు హాలిడేస్‌ ఉన్నాయి.

అదే విధంగా కార్తీక మాసం చివరిరోజు కావడంతో మా సినిమా కూడా కుటుంబసమేతంగా చూడగలిగిన సినిమా అని ఆ రోజునే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం ఈ సినిమా తరువాత 2019 నుండి వరుసగా సినిమాలు చెయ్యాలని అనుకొంటున్నాను. కొన్ని స్టోరీస్‌ కూడా వింటున్న వాటిని ఫైనలైజ్‌ చేసి వివరాలు తెలియచేస్తాను అంటూ ముగించారు సుధాకర రెడ్డి.

అది లోకేష్ కెరీర్ కు మరింత మైనస్ కాదా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్