cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Press Releases

సక్సెస్ ఫుల్ రన్ లో 'సురవరం'

సక్సెస్ ఫుల్ రన్ లో 'సురవరం'

క‌థానాయ‌కుడు నిఖిల్, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టించిన చిత్రం `అర్జున్ సుర‌వ‌రం`. బి.మ‌ధు స‌మ‌ర్ప‌ణ‌లో  టి.సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో రాజ్‌కుమార్ ఆకెళ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు.. ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ మీట్ లో  హీరో నిఖిల్ మాట్లాడుతూ అర్జున్ సురవరం సినిమా థియేటర్స్ లో సందడి చేస్తోంది. మొదటి ఆటనుండి పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది.  మా చిత్ర యూనిట్ అందరూ ఈ సక్సెస్ తో హ్యాపీగా ఉన్నాము. నిర్మాత  ఠాగూర్ మధు  రాజ్ కుమార్ అందించిన రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్, సంతోష్ టేకింగ్ ఇలా అందరి ఎఫర్ట్ తో సినిమా అన్ని ఏరియాల్లో బాగా కలెక్ట్ చేస్తోంది.

కొంత గ్యాప్ తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చినా సరే ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. సినిమాలో ఉన్న మెసేజ్ కు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మెయిన్ హైలెట్ అయ్యింది. లావణ్య ఈ సినిమాలో మరో మంచి రోల్ చేసింది. ఈ క్యారెక్టర్ ను నమ్మి ఈ సినిమా ఒప్పుకున్నందుకు ఆమెకు థాంక్స్, సినిమా చూడనివారు చూడండి, మిమ్మల్ని అర్జున్ సురవరం తప్పకుండా ఎంటర్టైన్ చేస్తాడన్నారు.

చిత్ర నిర్మాత రాజ్‌కుమార్‌ అకెళ్ల మాట్లాడుతూ చాలా సమస్యలను అధిగమించి ఈ సినిమాను రిలీజ్ చేశాము. సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్ కు ధన్యవాదాలు.  చిత్ర దర్శకుడు టి.సంతోష్‌ మాట్లాడుతూ  తెలుగులో నా తొలి చిత్రమిది. మమ్మల్ని సపోర్ట్‌ చేస్తున్న ఆడియన్స్ కు థ్యాంక్స్‌ నిఖిల్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మర్చిపోలేనిదన్నారు.

హీరోయిన్ లావణ్యా త్రిపాఠి మాట్లాడుతూ సినిమా బాగుందని అందరూ అంటుంటే హ్యాపీగా ఉంది.  ఈ ఏడాది విడుదలవుతున్న నా మొదటి తెలుగు సినిమా ఇంత సక్సెస్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.