cloudfront

Advertisement


Home > Movies - Press Releases

సుధీర్ 'నన్నుదోచుకుందువటె'

సుధీర్ 'నన్నుదోచుకుందువటె'

ప్రేమకథాచిత్రమ్ తరువాత సమ్మోహనం సినిమాతో సరైన హిట్ స్వంతం చేసుకున్న హీరో సుధీర్ బాబు ఇటీవలే స్వంత ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ మీద అందిస్తున్న తొలి సినిమాకు 'నన్ము దోచుకుందువటె' అనే టైటిల్ ఫిక్స్ చేసారు. సుధీర్ బాబు ఫ్రొడక్షన్స్ పేరిట నిర్మిస్తున్న 'నన్ను దోచుకుందువటె' సినిమా దాదాపు టాకీ పూర్తి చేసుకుంది.

నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు ఆర్ ఎస్ నాయుడు రూపొందిస్తున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఏమాత్రం తగ్గకుండా, తన మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తున్న ఈ సినిమాకు ఈ నెలాఖరున ఫస్ట్ లుక్ విడుదల చేస్తారు. జూలై లేదా ఆగస్టులో విడుదల వుంటుంది.

నాజర్, తులసి, వేరు, రవివర్మ, జీవా, సౌందర్ రాజన్ తదితరులు నటించే ఈ సినిమాకు అజనీష్ లోక్ నాధ్ సంగీతం అందిస్తున్నారు. సమ్మోహనం సినిమా విజయవంతం అయిన నేపథ్యంలో అతి త్వరగా ఈ సినిమాను ఫినిష్ చేసి విడుదల చేసే ప్రయత్నంలో సుధీర్ బాబు టీమ్. ఈ సినిమా తరువాత గోపీచంద్ బయోపిక్ మీదకు వెళ్తారు.