cloudfront

Advertisement


Home > Movies - Press Releases

సుమంత్ అశ్విన్-నందిత శ్వేత జోడీ

సుమంత్ అశ్విన్-నందిత శ్వేత జోడీ

ప్రేమ కథా చిత్రమ్ తో ట్రెండ్ ని క్రియెట్ చేసి, జక్కన్న తో కమ‌ర్షియ‌ల్ స‌క్స‌స్ ని సాధించిన ఆర్‌.పి.ఏ క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో ప్రొడక్ష‌న్ నెం-3 గా తెర‌కెక్కుతున్న చిత్రం ప్రేమ‌క‌థాచిత్ర‌మ్2 . ఈచిత్రంతో హ‌రి కిషన్ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నాడు.

సుమంత్ అశ్విన్‌,సిద్ధి ఇన్నాని జంట‌గా న‌టిస్తున్నారు. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రంలో త‌న పెర్‌ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్ష‌కుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకున్న నందిత శ్వేత మెయిన్ హీరోయిన్ గా న‌టిస్తోంది.

ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మాతగా తెర‌కెక్కుతున్న‌ ప్రేమ కథా చిత్రం 2సినిమా షూటింగ్ పూర్త‌యింది. జ‌న‌వ‌రిలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.