Advertisement


Home > Movies - Press Releases
సమ్మర్ కు స్యూటబుల్ ఫామిలీ మూవీ

ఈ నెలలో నాన్ బాహుబలి సినిమాల్లో కాస్త ఆసక్తి కలిగిస్తున్న సినిమాల్లో మిస్టర్ ఒకటి. మెగా హీరో వరుణ్ తేజ, టాప్ డైరక్టర్లలో ఒకరైన శ్రీను వైట్ల కలిసి చేసిన వెంచర్ ఇది. ఈ సినిమా ఈ నెల 14న విడుదలవుతోంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చుసుకుంది. సింగిల్ కట్ లేకుండా యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. కొన్ని యాక్షన్ సీన్లు వుండడంతో, యు/ఎ తప్పలేదు.

ఈ సందర్భంగా నిర్మాత టాగోర్ మథు మాట్లాడుతూ ఇటీవలి కాలంలో కాస్త హెవీ స్టోరీతో వస్తున్న సినిమా ఇది. సినిమా ఆద్యంతం ఎంగేజ్డ్ గా నడుస్తుంది. ఎక్కడా కథ నుంచి డీవియేట్ అయ్యే సీన్లు కానీ, ఇతరత్రా వ్యవహారాలు కానీ వుండవు. ఏ పెద్ద హీరో కైనా సరిపోయేంత పొటెన్షియాలిటీ, స్పాన్ వున్న కథ ఇది. వరుణ్ తేజ కేరీర్ లో మంచి సినిమా అవుతుంది. అంతే కాదు శ్రీనువైట్ల కమ్ బ్యాక్ ఫిల్మ్ అని కూడా ఆయన అభిమానులు అంటారు. విక్కీ జె మేయర్ మాంచి అడియో ఇచ్చారు. కొన్నాళ్ల పాటు చార్ట్ బస్టర్ గా కనీసం మూడు పాటలు వుంటాయి. ముకుంద తరువాత మళ్లీ మా బ్యానర్ లో వరుణ్ తేజ చేస్తున్నాడు. కచ్చితంగా మా బ్యానర్ వాల్యూ పెంచే సినిమా అవుతుంది..అని అన్నారు.

మరో నిర్మాత నల్లమలుపు బుజ్జి మాట్లాడుతూ, ఫ్యామిలీలు సమ్మర్ లో చూడడానికి అన్ని విధాలా సూటయ్యే సినిమాగా మా మిస్టర్ నిలుస్తుంది. ఫ్యామిలీలు తమ పిల్లలతో సహా హ్యాపీగా సినిమాను చూడొచ్చు. ఇటు ఫ్యామిలీ వాల్యూస్, అటు లవ్, ఇంకా ఫన్ అన్నీ సమపాళ్లలో మిక్స్ అయ్యాయి అని అన్నారు.

సంగీత దర్శకుడు విక్కీ జె మేయర్ మాట్లాడుతూ, విడుదలైన ఓవర్ నైట్ లోనే నా ఫ్రెండ్స్, అభిమానులు అడియో ఎంతో బాగుంది అంటూ మెసేజ్ లు పెడుతున్నారు. డిఫరెంట్ గా వున్నాయి, కొత్తగా ట్రయ్ చేసావ్ అంటూ ప్రశంసిస్తుంటే ఆనందంగా వుంది అని అన్నారు.

వరుణ్ తేజ సరసన ఈ సినిమాలో లక్కీ హీరోయిన్లు హెబ్బా పటేల్, లావణ్య త్రిపాఠీ నటిస్తున్నారు.