cloudfront

Advertisement


Home > Movies - Press Releases

సువ‌ర్ణ‌సుంద‌రి ట్రైల‌ర్ విడుద‌ల‌

సువ‌ర్ణ‌సుంద‌రి ట్రైల‌ర్ విడుద‌ల‌

జయప్రద, పూర్ణ, సాక్షిచౌదరి ప్రధాన పాత్రల్లొ తెరకెక్కుతొన్న చిత్రం "సువర్ణసుందరి". ఈ సినిమాను సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా దర్శకుడు సూర్య తెరమీదకు తీసుకు వస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతుందన్న ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ తో ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ట్రయిలర్ ను సీనియర్ దర్శకుడు బి గోపాల్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా  హీరోయిన్ సాక్షి మాట్లాడుతూ... ఇది చాలా అద్భుత‌మైన చిత్రం. మంచి పాట‌లు. ఫైట్స్ చాలా బాగా వ‌చ్చాయి. స్టంట్ మాస్టర్ చాలా కోప‌రేట్ చేశారు. నాకు బాగా హెల్ప్‌చేశారు. ఆయ‌న‌కు నా కృత‌జ్ఞత‌లు. నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన దర్శకుడికి నా కృత‌జ్ఞత‌లు అన్నారు.

హీరో ఇంద్ర మాట్లాడుతూ... నాకు ఈ చిత్రంలో న‌టించే అవ‌కాశం రావ‌డానికి కార‌ణం దర్శకుడు సూర్య. నేను వంగ‌వీటి చిత్రంలో న‌టిస్తుండ‌గా ఒక‌రోజు ఫోన్ చేసి ర‌మ్మని నాకు నా పాత్ర గురించి వివ‌రించారు. నాపైన న‌మ్మకం ఉంచి నాకు అంత మంచి పాత్ర‌ను ఇచ్చినందుకు ఆయ‌న‌కు నేను జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాను టీమ్ అంద‌రికీ నా కృత‌జ్ఞత‌లు అని అన్నారు.

హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ... ఒక మ‌నిషికి స‌హ‌నం అంటే అది సూర్య నుంచే నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరికీ చాలా ఓర్పుగా చ‌క్కగా వివ‌రించి ఆయ‌న‌కు ఏమి కావాలో ఆ అవుట్ పుట్ తెప్పించుకున్నారు అన్నారు.

మరో హీరో రాము మాట్లాడుతూ... నాకు ఈ చిత్రంలో అవ‌కాశం రావ‌డానికి కార‌ణం సాయి కార్తిక్. ఆయన ద్వారానే నాకు ఈ చిత్రంలో న‌టించే అవ‌కాశం క‌ల్పించారు. ఇది నా మొద‌టి చిత్రం. సూర్యగారికి నా కృత‌జ్ఞత‌లు అన్నారు.

డైరెక్టర్ సూర్య మాట్లాడుతూ... ఈ సినిమాని చాలా  స్పెష‌ల్‌గా చేశాం. ఈ చిత్రంలో న‌టించిన న‌టీన‌టులంద‌రూ నాకు చాలా స‌హ‌క‌రించారు. ప్రతి ఒక్కరికి పేరు పేరునా నా కృత‌జ్ఞత‌లు అన్నారు. ప్రతి ఆర్టిస్ట్ చాలా బాగా న‌టించారు. ఈ చిత్రంలో  విఎఫెక్స్ విజువ‌ల్స్ ఉండ‌డం వ‌ల్ల లేట్ అయింది. విఎఫ్ఎక్స్ కోసం క‌నీసం ఏడాదిపాటు వ‌ర్క్ జ‌రిగింది. లేటు అయినా కూడా ఫ‌లితం చాలా బాగా వ‌చ్చింది. మా యూనిట్ అంద‌రికీ న‌న్ను ఆశీర్వదించ‌డానికి ఇక్కడికి వ‌చ్చిన పెద్దలందరికీ నా కృత‌జ్ఞత‌లు అన్నారు.

కీలకమైన 'పోల్‌ మేనేజిమెంట్‌' జగన్ ఎదుర్కోగలడా?