cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Press Releases

కొత్త కాన్సెప్ట్ తో 'తాగితే తందానా'

కొత్త కాన్సెప్ట్ తో 'తాగితే తందానా'

ఆదిత్, సప్తగిరి, మధునందన్ ముఖ్యపాత్రధారులుగా రైట్ టర్న్ ఫిలిమ్స్ పతాకంపై శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో వి.మహేష్, వినోద్ జంగపల్లి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం "తాగితే తందానా". సిమ్రాన్ గుప్తా, రియా హీరోయిన్స్ గా నటించారు.

ఈ చిత్రం ఫస్ట్ లుక్, బ్యానర్ లోగో లాంచ్ కార్యక్రమం ప్రసాద్ లాబ్స్ లో ఆత్మీయ అతిధుల మధ్య ఘనంగా జరిగింది.

ఈ వేడుకలో  దర్శకుడు మారుతి, నిర్మాత దామోదరప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. రైట్ టర్న్ ఫిలిమ్స్ (rtf) బ్యానర్ లోగోని దామోదరప్రసాద్ లాంచ్ చేయగా, సినిమా మొదటి లుక్ ని మారుతి ఆవిష్కరించారు.. 

ఈ సందర్భంగా హిట్ చిత్రాల దర్శకుడు మారుతి మాట్లాడుతూ..  రైట్ టర్న్ ఫిలిమ్స్  బ్యానర్ చాలా ఇన్నోవేటివ్ గా వుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ చూడగానే ఎగ్జైటింగ్ గా అనిపించింధి. కొత్త కాన్సెప్టులతో వస్తే డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. ఈ సినిమా సక్సెస్ అయి నిర్మాతలకి రైట్ టర్న్ ఫిలిం అవ్వాలని కోరుకుంటున్నాను.. అన్నారు.

ప్రముఖ నిర్మాత దామోదరప్రసాద్ మాట్లాడుతూ.. కొత్త వాళ్ళు సరైన ప్లానింగ్ తో వస్తే డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. ఈ నిర్మాతలు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో అనుకున్న టైములో సినిమా కంప్లీట్ చేశారు. ఫస్ట్ లుక్ చాలా ఫన్నీగా వుంది సినిమా కూడా అలాగే ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నా అని అన్నారు.. 

హీరో ఆదిత్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు నేను 16 చిత్రాలు చేశాను. వాటిలో 13 చిత్రాలు కొత్త దర్శకులతోనే చేశాను. తెలిసో తెలియకో నాకు అన్నీ మంచి టైటిల్స్ కుదిరాయి. అలాగే ఈ సినిమాకి కూడా ఇంట్రెస్టింగ్ ఫన్నీ టైటిల్ సెట్ అయింది. ఈ సినిమా మంచి హిట్ అయి మరిన్ని చిత్రాలు ఇంకా ఎన్నో నిర్మించాలని కోరుకుంటున్నాను.. అన్నారు. 

సప్తగిరి మాట్లాడుతూ.. ఒక పక్క హీరోగా చేస్తున్నాను. కమీడియన్ గా మంచి పత్రాలు వస్తే చేద్దాం అనుకుంటున్నా తరుణంలో శ్రీనాథ్ కథ చెప్పాడు. నాకు బాగా నచ్చింది. కళ్ళు మూసుకొని ఈ సినిమా చేసేశాను. ఫుల్ లెంగ్త్ కామిడీ రోల్ ప్లే చేశాను.  ఆదిత్, మధు నేను కలిసి చేసిన ఈ సినిమా కచ్చితంగా  ప్రేక్షకులను అలరిస్తుంది అని అన్నారు. 

చిత్ర దర్శకుడు శ్రీనాథ్ మాట్లాడుతూ.. బేసిగ్గా రైటర్ ని. కొత్త డైరెక్టర్ నైనా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరు కూడా మంచి సపోర్ట్ చేశారు. మా కథకి యాప్ట్ టైటిల్ ఇది.  ముగ్గురు కుర్రాళ్లు తాగి ఆ మత్తులో ఒక సమస్యలో ఇరుకుంటారు.. దానినుండి ఎలా బయటపడ్డారనేది కాన్సెప్ట్. చాలా ఫన్నీగా ఉంటుంది.  అన్నారు. 

మధునందన్, లైన్ ప్రొడ్యూసర్ అనిల్, నిర్మాతల్లో ఒకరైన వినోద్ జంగపల్లి తదితరులు ప్రసంగించారు.