cloudfront

Advertisement


Home > Movies - Press Releases

టాక్సీవాలా సాంగ్ కు మిలియన్ల వ్యూస్

టాక్సీవాలా సాంగ్ కు మిలియన్ల వ్యూస్

గీతా గోవిందం చిత్రంలోని ఇంకేం ఇంకేం కావాలి.... అనే పాట ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇప్పుడిదే ఊపును ప్రదర్శిస్తోంది మరో పాట. "మాటే వినదుగా"... అంటూ సాగే ఈ పాట టాక్సీవాలా చిత్రంలోనిది. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో కమర్షియల్ స్టామినా ఉన్న స్టార్ హీరోగా ఎదిగిన విజ‌య్‌ దేవరకొండ నటిస్తున్న టాక్సీవాలా చిత్రంలోని మాటే వినదుగా అనే పాట 2 మిలియన్ వ్యూస్ సంపాదించేందుకు ఏంతో టైం పట్టలేదు.

ముఖ్యంగా ఈ పాటలోని మెలోడీ టచ్ మ్యూజిక్ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. శ్రీరామ్ తన గొంతుతో మరోసారి మ్యాజిక్ చేశాడు. కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. జేక్స్ అద్భుతమైన మెలోడీ ట్యూన్ అందించాడు.  మంచి అభిరుచి గల నిర్మాణ సంస్థలుగా పేరు తెచ్చుకున్న జిఏ2 పిక్చర్స్ మ‌రియు యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంతో రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా పరిచయమౌతున్నారు.

గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండకు ఏర్పడిన క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని సస్పెన్స్, సైంటిఫిక్ థ్రిల్లర్ కథాంశాన్ని హిలేరియస్ కామెడీతో ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని పోస్ట్‌ ప్రొడ‌క్షన్  వర్క్ శరవేగంగా జ‌రుపుకుంటోంది. నవంబర్ 16న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

కలెక్షన్ల లెక్కలు నిజమేనా క్లారిటీ కోసం చదవండి ఈ వారం గ్రేట్ ఆంధ్ర పేపర్