cloudfront

Advertisement


Home > Movies - Press Releases

తేజూతో సినిమా చేస్తున్నాం

తేజూతో సినిమా చేస్తున్నాం

సాయి థరమ్ తేజతో గోపీచంద్ మలినేని డైరక్షన్ లో ప్లాన్ చేసిన సినిమా యథాతథంగా వుంటుందని నిర్మాత పుల్లారావు తెలిపారు. ఇంటిలిజెంట్ సినిమా తరవాత తమ నిర్ణయం మార్చుకున్నామని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన తెలిపారు.

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ కేఎస్ రామారావు నిర్మాతగా సినిమా చేస్తున్నారని, అది పూర్తి కాగానే తమ సినిమా వుంటుందని ఆయన వివరించారు

ఇప్పటికే టెక్నికల్ టీమ్ కూడా ఫిక్స్ అయిందని, యువరాజ్ సినిమాటోగ్రఫీ, దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తారని పుల్లారావు చెప్పారు. మే తరువాత తమ షూట్ స్టార్ట్ అవుతుందని వెల్లడించారు.

ఇండస్ట్రీలో హిట్, ఫ్లాప్ లు కామన్ అని, అంతమాత్రం చేత వెనక్కు వెళ్లిపోవడం వుండదని, తమ సినిమా కథ, తమ ప్రాజెక్టు కాస్ట్ ఇవన్నీ చూసుకుంటాం తప్ప వేరు కాదని, ఈ విషయంలో వినిపిస్తున్న వార్తలు కరెక్ట్ కాదని ఆయన వివరించారు.