cloudfront

Advertisement


Home > Movies - Press Releases

టెంప్ట్ ర‌విని బ‌య‌పెడుతున్న 'వైఫ్‌,ఐ'

టెంప్ట్ ర‌విని బ‌య‌పెడుతున్న 'వైఫ్‌,ఐ'

ఇటీవ‌ల యూట్యూబ్ లో టీజ‌ర్ తోనే సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిన ఏడుచేప‌ల క‌థ సినిమాతో  టెంప్ట్ రవి గా పాపులర్ అయిన అభిషెక్ రెడ్డి, సాక్షి నిదియా జంట‌గా, ఏడు చేప‌ల క‌థ చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన జి.చ‌రితా రెడ్డి నిర్మాతగా జి.ఎస్‌.ఎస్‌.పి.క‌ళ్యాణ్ ద‌ర్శ‌కుడిగా నిర్మిస్తున్న ఈచిత్రానికి "వైఫ్,ఐ" అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు. ఈ చిత్రానికి నైఫ్ బెట‌ర్ దెన్ వైఫ్ అనే క్యాప్ష‌న్ ని పెట్టారు.. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని గురువారం విడుదల చేశారు.

ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు జి.ఎస్‌.ఎస్‌.పి క‌ళ్యాణ్ మాట్లాడుతూ..  ఈ చిత్రం లో భార్య‌, భర్త మధ్య వుండే అన్ని ర‌సాలు క‌ల‌గలుపుగా వుంటాయి. బార్యాభ‌ర్త‌ల మధ్య ప్రెజెంట్ ట్రెండ్ లో వున్న అసూయ ద్వేషాలు, ఎప్ప‌టికో క‌నిపించే ప్రేమ దానిలో పొంగుకొచ్చే రొమాన్స్ ఇవ‌న్ని మించితే వారి జీవితాలు ఎలా వుంటాయ‌నేది చాలా చ‌క్క‌గా మంచి కంటెంట్ తో తెర‌కెక్కించాము. మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తాం.. అని అన్నారు.

నిర్మాత జి.చ‌రితా రెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి క‌థ‌లు ఈ జెన‌రేష‌న్ లో రావాలి.. అంద‌రూ త‌ప్ప‌కుండా చూడాలి.. వైవాహిక జీవితాలు నాశ‌నం అయిపోతున్న రోజులు.. భార్యాభర్త మధ్య ప్రేమ‌లు పోయి అసూయ‌లు పెరుగుతున్న రోజులివి. దర్శకుడు చాలా చ‌క్క‌గా కళ్యాణ్ తెర‌కెక్కించాడు. అభిషేక్ రెడ్డి, సాక్షి ఈ క‌థ కి చాలా చ‌క్క‌గా సెట్ అయ్యారు అని అన్నారు.

బాబు భ్రమలను నమ్మని జనం.. వికేంద్రీకరణకే జగన్‌ మొగ్గు?