
అమెరికాలో బాగా చదువుకుని, సినిమా మీద మోజుతో, అక్కడ కోర్సులు చేసి, తెలుగు రంగంలోకి అడుగుపెట్టి సినిమాలు తీసిన వారు చాలా మందే వున్నారు. వీరిలో కొందరు సక్సెస్ కొట్టారు. కొందరు కొట్టే ప్రయత్నాల్లో వున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో మరో పేరు యాడ్ అయింది. సుబ్బు వేదుల అనే యంగ్ టాలెంట్ న్యూయార్క్ యూనివర్సిటీ ఫిల్మ్ స్కూల్ లో చదువుకుని, తొలిసారి ఓ థ్రిల్లర్ సినిమాను అందించడానికి టాలీవుడ్ లోకి వచ్చాడు.
కృతి గార్గ్, అభిరామ్ వర్మ , కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక తదితరులతో రాహు అనే సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. తెలుగు సినిమాల్లో ఎక్కువగా చూడని థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ ఇందులో వుండబోతున్నాయని చిత్ర దర్శకుడు సుబ్బు చెబుతున్నారు.
ఈ సినిమా కాన్సెప్ట్, నటీ నటుల పెర్ఫార్మన్స్ ప్రేక్షకుల్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుందని చిత్ర నిర్మాతలు ఏ వి ఆర్ స్వామీ, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, అంటున్నారు. ఈ సినిమాకు డిఓపి - సురేష్ రగుతు, మ్యూజిక్ - ప్రవీణ్ లక్కరాజు
వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రీ ఎంట్రీ..?