cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Press Releases

టక్కర్ ఫస్ట్ లుక్

టక్కర్ ఫస్ట్ లుక్

తెలుగువారికి చిరపరిచయం అయిన హీరో సిద్ధార్థ లేటెస్ట్ సినిమా 'టక్కర్'. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మెగా హీరో వరుణ్ తేజ్ ఈ రోజు విడుదల చేసారు. 

సిద్ధార్థ్, దివ్యంశ కౌశిక్ హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాలో అభిమన్యు సింగ్, యోగిబాబు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. 

2020 ఫిబ్రవరి లో ఈ సినిమాను విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సుధన్ సుందరం, జయరాం నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఫ్యాషన్ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కుతోంది.

గతంలో కప్పల్, పాండవుల్లో ఒకడు చిత్రాలకు దర్శకత్వం వహించిన కార్తిక్ జీ క్రిష్ ఈ సినిమాను దర్శకత్వం వహిస్తున్నారు. నివాస్ కె ప్రసన్న ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.

 


×