cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Press Releases

జార్జి రెడ్డి కి యు/ఎ

జార్జి రెడ్డి కి యు/ఎ

‘‘వంగవీటి’’ఫేం సందీప్ మాధవ్  (సాండి) లీడ్ రోల్ లో నటించిన మూవీ ‘‘జార్జిరెడ్డి’’.. 1965 నుంచి 1975 కాలంలో హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో చదువుతూ.. విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడుగా ఎదిగిన ‘‘జార్జి రెడ్డి’’ స్టూడెంట్ లీడర్ బయోపిక్ గా ఈ సినిమా  తెరకెక్కింది..ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ తోనే అంచనాలు పెంచిన ఈ  ‘‘జార్జిరెడ్డి’’ సినిమా  ఈ నెల 22  రిలీజ్ కు రెడీ అయింది.

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికేట్ ని పొందింది. సెన్సార్ సభ్యుల ప్రశంసలు అందుకుంది.  ఈ నెల 17న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరపబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు.

జార్జి రెడ్డి మూవీ పై వస్తున్న రెస్పాన్స్ దృష్టిలో పెట్టుకొని ఈ నెల 21న ప్రివ్యూ లు ను ఏర్పాటు చేశారు నిర్మాతలు. 

‘దళం’ మూవీ ఫేం జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి.. సిల్లీ మంక్స్, త్రీ లైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ప్రముఖ హీరో సత్య దేవ్ ఓ మెయిన్  రోల్ చేసిన ఈ సినిమాలో ముస్కాన్, మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు,వినయ్ వర్మ, తిరువీర్, అభయ్,మహాతి ఇతర నటీనటులు.