cloudfront

Advertisement


Home > Movies - Press Releases

వజ్రకవచధర లాభాలు పండిస్తుంది

వజ్రకవచధర లాభాలు పండిస్తుంది

స్టార్‌ కమెడియన్‌ సప్తగిరి, యంగ్‌ డైరెక్టర్‌ అరుణ్‌ పవార్‌ కాంబినేషన్‌ లో వచ్చిన 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' ఎంతటి ఘ‌న విజయాన్ని సాధించిందో అందరికీ తెలుసు. ప్రస్తుతం వీళ్లిద్దరి కాంబినేషన్‌లో శివ శివమ్‌ ఫిలిమ్స్‌ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం 'వజ్రకవచధర గోవింద'. జూన్‌ 14న గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతున్న ఈ చిత్రం హక్కులను అవుట్ రేట్ గా డిస్ట్రిబ్యూటర్‌ బ్రహ్మయ్య కొనేసి విడుదలచేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు అరుణ్‌ పవార్‌ మీడియాతో మాట్లాడారు.

''..సప్తగిరి బాడీ లాంగ్వేజ్, కామెడీ ఇమేజ్ కు తగినట్లు సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమా కథ అప్పట్లో తయారుచేసాను. మళ్లీ ఇన్నాళ్లకు సప్తగిరితో పనిచేసే అవకాశం వచ్చింది. మళ్లీ ఆయన కోసం మాంచి కథ తయారుచేసాను. అదే వజ్ర కవచధర గోవింది. ఈ సినిమాలో సప్తగిరి క్యారెక్టర్‌ పేరు గోవింద్‌. అతను ఒక వజ్రానికి ఎలా కవచంలా నిలబడ్డాడు అనేది కాన్సెప్ట్‌. అందుకే ఆ టైటిల్‌ అని పెట్టాం. అలాగే 'వజ్రకవచధర గోవింద' అనేది వేంకటేశ్వరుని సహస్ర నామాల్లో ఒకటి. అలా టైటిల్‌ కొంచెం లెంగ్తీ అయినా ఎన్ని సార్లు తలచుకుంటే అంతమంచిది అని ఆ టైటిల్‌నే కన్ఫర్మ్‌ చేశాం. 

కథానుగుణంగా ఈ సినిమా క్లైమాక్స్‌లో హీరో గతం మర్చి పోయి పిచ్చివాడిలా ప్రవర్తిస్తూ ఉంటాడు. జబర్దస్త్‌ ఆర్టిస్టులు మొత్తం కలిసి అతనికి గతాన్ని గుర్తుచేసే క్రమంలో ఈ సాంగ్‌ వస్తుంది. ఆ జబర్దస్త్‌ బ్యాచ్‌కి లీడర్‌గా శ్రీనివాస్‌ రెడ్డి నటించారు. ఈ సాంగ్‌ రైట్స్‌ని చైనా నుండి తీసుకోవడం జరిగింది. ఆ సాంగ్‌ ఆడియన్స్‌ నుండి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. 

సినిమాలో తన  క్యారెక్టర్‌కి సప్తగిరి తన బెస్ట్ పెర్‌ఫామెన్స్‌ ఇచ్చారు.   ఈ సినిమాలో సప్తగిరి కామెడీ హీరోగానే కనిపిస్తారు. కమర్షియల్‌ లెవెల్లో మాస్‌ ఎలివేషన్స్‌ ఉన్నా కూడా అవి కామెడీ పంథాలోనే ఉంటాయి. కామెడీతో పాటు సెకండ్‌ హాఫ్‌లో మంచి సెంటిమెంట్‌ కూడా ఉంటుంది. అది థియేటర్‌లో ఆడియన్స్‌ని తప్పకుండా కంటతడి పెట్టిస్తుంది. 

సిజి వర్క్ చేస్తే కోట్లలో ఖర్చు చేయాలి. అలాంటి నేపథ్యలో ఒక సీన్ కోసం కర్నూలు గుహల్లో షూట్ చేసాం. ఈ విషయంలో సప్తగిరి కాస్త రిస్క్ చేసి చేసారనే చెప్పాలి.  సినిమా అంతా దాదాపు రియల్ లోకేషన్లలో చేసాం. సినిమా టీజర్ చూసి సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ బ్రహ్మయ్య అవుట్ రేట్ కు సినిమాను కొనేసారు. ఆయనకు లాభాలు వస్తాయని కచ్చితంగా నమ్ముతున్నాను. 

వెల్ డన్ జగన్ ..కీప్ ఇట్ అప్