cloudfront

Advertisement


Home > Movies - Press Releases

'వీరభోగ 'ఫస్ట్ లుక్

'వీరభోగ 'ఫస్ట్ లుక్

నారా రోహిత్‌, శ్రీవిష్ణు, సుధీర్ బాబు, శ్రీయ కాంబినేష‌న్ లో రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రం వీర భోగ వసంత రాయలు. ఈ చిత్రాన్ని బాబా క్రియేష‌న్స్ ప‌తాకంపై, ఎంవికె రెడ్డి గారి సమర్పణలో అప్పారావు బెల్లాన నిర్మిస్తున్నారు. ఇంద్ర‌సేన‌.ఆర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రం టైటిల్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. 

ఈ సంద‌ర్బంగా నిర్మాత అప్పారావు బెల్ల‌న మాట్లాడుతూ.. ఈ సినిమా ఇప్పటివరకు ఎవ్వరు చూడని విధంగా ఎవరు ఊహించని విధంగా డిఫరెంట్ గా ఉంటుంది అని అన్నారు. 
ద‌ర్శ‌కుడు ఇంద్ర‌సేన.ఆర్ మాట్లాడుతూ.. నారా రోహిత్ శ్రీ విష్ణు, సుదీర్ బాబు, శ్రీయ లకు చాలా థాంక్స్. ఈ కాలంలో  పాపాలు పెరిగాయి... దాని చుట్టూనే కథ తిరుగుతుంది అని వెల్లడించారు.

హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.... ఇదే స్టేజిమీద అప్పట్లో ఒకడుండేవాడు సినిమా ప్రమోషన్ మొదలుపెట్టాం.  వీరభోగ వసంతరాయలు సినిమాను మళ్ళీ తీయాలంటే అది కేవలం డైరెక్టర్ ఇంద్ర వల్లనే సాధ్యం అవుతుంది. సినిమా చూసాక కూడా ప్రేక్షకులు కూడా తల్లకిందులైపోతారు. సినిమా ప్రారంభమైన పదిహేను నిమిషాలకు ఇంగ్లీష్ సినిమా నా తెలుగు సినిమా నా అనే విధంగా వుంటుంది. 

హీరో నారా రోహిత్ మాట్లాడుతూ... ముందుగా ఈ పోస్టర్ ని అద్భుతంగా తీర్చిదిద్దిన భానుకి స్పెషల్ థాంక్స్ సినిమాను రిఫ్లెక్ట్ చేసేది పోస్టర్స్. ఈ సినిమాలో హీరోలు అంటూ ఉండరు. ప్రతీ క్యారెక్టర్ హీరోనే ఈ సినిమాకు. ఇది ఎక్స్పరిమెంట్ సినిమా. మన తెలుగులో అయితే కచ్చితంగా ఇలాంటి సినిమా రాలేదు. ఇంద్ర ప్రపంచాన్ని తలక్రిందులుగా చూశాడు. సినిమా కూడా అలాంటి కాన్సెప్ట్ తోటే ఉంటుంది. ఈ సినిమా టీజర్ త్వరలోనే రిలీజ్ అవుతాయి. అని అన్నారు.