దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేఫథ్యంలో నిర్మించిన సినిమా 'యాత్ర'. ఈ సినిమాను 70 యమ్.యమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తమ 3వ చిత్రంగా నిర్మించింది. దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేశారనే విషయం మాత్రమే తెలుగు ప్రజలకి తెలుసు కాని ఆ పాదయాత్ర ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎంత కీలకమో కొంతమందికే తెలుసు.
అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆయన ప్రజలకి దగ్గరగా వెళ్ళాలని నిశ్చయించుకున్నప్పుడు ఎదురైన అనుభవాలు.. ఆటంకాలు.. వాటన్నింటిని కాదని కడప దాటి ప్రతి గడపలోకి స్వయంగా వెళ్ళి పేదవాడి సమస్యలు తెలుసుకోవడానికి ఈ యాత్ర మెదలుపెట్టారు వైఎస్ ఆర్.యాత్ర ప్రారంభమైన దగ్గరనుండి ప్రతి రైతుని, పేదవాడిని స్వయంగా కలిసి వారి సమస్యలు వినటమేకాదు... విన్న రాజశేఖరుడి హృదయం ఎలా స్పందించిందో ఆయనకే తెలుసు.. డాక్టర్ రాజశేఖరుడుగా ప్రారంభించిన యాత్ర రాజన్నగా ముగిసిందంటే ఆయన ప్రజలకి అంతగా దగ్గరయ్యారనేది అక్షరసత్యం.
దానికి నిదర్శనమే యాత్ర... ఫిబ్రవరి 8న విడుదల అవుతున్న ఈ చిత్రానికి బాక్సాఫీస్ స్పీడ్ అందుకోవడమే కాదు, అటు అమెరికా నుండి అనకాపల్లి వరకూ అనూహ్యమైన స్పందన లభిస్తోంది. సాధారణంగా ఒక సినిమా హీరో బయోపిక్ తీసినా లేదా బిగ్ కాస్టింగ్ తో తీసినా మంచి ఓపెనింగ్స్ రావటం చూశాం. కాని మెట్టమెదటి సారిగా ఓ రాజకీయనాయకుడి బయోపిక్ తీస్తే ఒక్క ఓవర్సీస్ లోనే 180 స్క్రీన్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో 500 స్క్రీన్స్ లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు వెయ్యి స్క్రీన్స్ లో విడుదల చేయటం ఈ సినిమాపై తెలుగు ప్రజల క్రేజ్ ని తెలియజేస్తుంది.
ఇంకో విశేషం ఏమిటంటే, ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి తన పాదయాత్ర 68 రోజుల్లో పూర్తిచేసిన విషయం తెలిసిందే.. యాధృచ్చికంగా ఈ యాత్ర సినిమా షూటింగ్ కూడా 68 రోజుల్లో పూర్తికావటం ఆ పెద్దాయన ఆశిస్సులుగా యూనిట్ సభ్యులు భావిస్తున్నారు.
వైఎస్ ఆర్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలకఘట్టం.. ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే ఈయాత్ర. 68 రోజులు సాగిన పాదయాత్రలో రైతుల కష్టాలు, పేదవాళ్ళ ఆవేదనలు ప్రతిఓక్కరి భావోద్వేగాలు రాజన్న మనసుతో వినటమే ఈ చిత్రంలో కీలకభాగం.
ఎటువంటి రాజకీయాలు లేని రాజకీయ నాయకుడి కథే ఈ యాత్ర. ప్రతిఓక్కరూ ఈ చిత్రాన్ని చూసి భావోద్వేగానికి లొనవుతారు..'' అని పదే పదే క్లారిటీ ఇస్తూ వస్తున్నారు దర్శకుడు మహి. కేవలం తెలుగు భాషలోనే కాకుండా తమిళ, మలయాల భాషల్లో భారతదేశం మెత్తం విడుదల చేస్తున్నారు. చక్కటి ఎమోషనల్ కంటెంట్ తో చూసిన ప్రతి ప్రేక్షకుడి బరువైన గుండెతో థియేటర్స్ నుండి బయటకి రావటం జరుగుతుందన్న ధీమాను దర్శకుడు వ్యక్తం చేస్తున్నారు.
విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మహనేత జీవితంలో కీలకఘట్టాన్ని ప్రతిష్టాత్మకంగా శివ మేక సమర్పణలో తెరకెక్కించారు. ఈ సినిమాలో వైఎస్ గా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి దాదాపు పరకాయ ప్రవేశం చేసారు.
''..ఇదిలా వుంటే ఈ చిత్రం చేయాలనుకున్నప్పటి నుండి విడుదల వరకూ వై.యస్ జగన్ కాని వారి ఫ్యామిలి కాని ఎక్కడా అభ్యంతరాలు పెట్టలేదు సరికదా కనీసం వివరాలు కూడా అడగలేదు.. దర్శకుడికి, ప్రోడక్షన్ కి ఫ్రీహ్యాండ్ ఇవ్వటం ఆయన గొప్పతనానికి నిదర్శనం..'' అంటున్నారు దర్శకుడు మహి... ఈ సందర్బంగా దర్శక, నిర్మాతలు వైయస్ జగన్ కు, వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
NTR పరువు తీసింది చంద్రబాబా? దగ్గుబాటా?