cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Press Releases

విజయ్ బ్రదర్ కు మూడో సినిమా

విజయ్ బ్రదర్ కు మూడో సినిమా

దొరసాని సినిమాతో తెరముందుకు వచ్చిన హీరో ఆనంద్ దేవరకొండ. బ్రదర్ విజయ్ దేవరకొండ స్టార్ కావడంతో, తమ్ముడు ఆనంద్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేసాడు. దొరసాని సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా, మరో సినిమా అయితే చేస్తున్నాడు. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా అనౌన్స్ చేసారు.

షార్ట్ ఫిలింమేకర్ దామోదర అట్టాడ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. టాంగా ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి (యూ.ఎస్.ఏ) బ్యానర్ పై విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నిర్మాతల్లో ఒకరైన విజయ్ మట్టపల్లి మాట్లాడుతూ "పలు షార్ట్ ఫిలింస్ తో ఆకట్టుకున్న దామోదర అట్టాడ ఓ మంచి కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీ ని అందిస్తున్నారని, ఇది హీరో ఆనంద్ దేవరకొండ కు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది.

కామెడీ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీలో ఆనంద్ లుక్ కూడా కొత్తగా ఉంటుందని చెప్పారు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. త్వరలోనే వాళ్ల పేర్లు ప్రకటిస్తాం. ఈ సినిమాతో ముగ్గురు కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నారు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. నవంబర్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.

‘సైరా నరసింహారెడ్డి’ వాస్తవికత ఎంతంటే!